టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన దర్శకుడు ఎవరు అంటే ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కూడా ముందుగా మదిలో మెదిలే దర్శకుడు బోయపాటి శ్రీను. ఆయన తన తొలి సినిమా నుంచి మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. అందుకే ఆయన సినిమాలన్నీ కూడా మాస్ హిట్ చిత్రాలు అవుతూ ఉంటాయి. ఆయన తొలిసారి దర్శకత్వం వహించిన భద్ర సినిమా ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.

ఇక బాలకృష్ణ అంటే ప్రత్యేక అభిమానం ఉండేది బోయపాటి శ్రీను కి.  ఆయనతో ఇప్పటివరకు రెండు సినిమాలు తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందించాడు. ఇప్పుడు మరొక హిట్ అందించి హ్యాట్రిక్ హిట్ ల ను బాలకృష్ణకు ఇవ్వడానికి అఖండ సినిమాతో సిద్ధమవుతున్నాడు.  ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడి ఇప్పటివరకు వాయిదా పడుతూ వచ్చింది. డిసెంబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రబృందం గట్టి ప్రయత్నాలే చేస్తోంది. వాస్తవానికి దసరాకి ఈ సినిమా విడుదల చేయాలనుకున్నారు. కానీ షూటింగ్ పూర్తి కాకపోవడంతో మరొకసారి వాయిదా వేయక తప్పలేదు.

ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుండగా బోయపాటి శ్రీను ఏ హీరో ను ఎంచుకోకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. అల్లు అర్జున్ తో బోయపాటి నెక్స్ట్ సినిమా అని పుకార్లు వినిపిస్తున్నాయి కూడా.. ఎవరి నుంచి ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో ఇది గాసిప్ గానే మిగిలింది. ఓ వైపు అల్లు అర్జున్ తో సినిమా ఛాన్స్ రావాలంటే బోయపాటి శ్రీను తప్పకుండా అఖండ సినిమాతో హిట్ సాధించాలి అనే వార్తలు అల్లు కాంపౌండ్ అంటున్నట్లు గా వస్తున్నాయి. ఇన్ని సినిమాలు గా ప్రేక్షకులను ముఖ్యంగా మాస్ ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన కొత్తగా ఈ పరీక్ష ఏంటో అర్థం కావడం లేదు అని ఆయన అభిమానులు అంటున్నారు. సినిమా ఛాన్స్ ఇవ్వడానికి బోయపాటి శ్రీను మరీ ఇంత అవమాన పరచాలా అని కూడా అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: