రాజకీయ రంగ ప్రవేశం చేసిన తొలి నటుడు ఎవరో తెలుసా ?

చలన చిత్ర రంగం నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన తొలి వ్యక్తి ఎవరు ? అని మిమ్మల్ని అడిగితే మీరు ఎం సమాధానం చెబుతారు ? కౌన్ బనేగా కరోర్ పతిలో ఈ ప్రశ్నే గనుక వస్తే మీరు ఠక్కుమని సమాధానం చెప్పగలరా ? సాధారణంగా ఈ తరం వాళ్లు చెప్పే  సమాధానం మెగాస్టార్ చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీ. తెలుగుదేశం పార్టీ బాలకృష్ణ అంతేనా ? మీరు జబర్దస్త్ కార్యక్రమానికి అభిమానులైతే మీ సమాధానం  నగరి శాసన సభ్యురాలు రోజా. ఇంకోక చాన్స్ ఇచ్చి ... కొంచెం మందుకు వెళ్లి ఆలోచించ మంటే.. జయసుధ, శారద, కోట శ్రీనివాస రావు, బాబు మోహన్.. ఇలా కొందరి పేర్లు చెప్పుకోవచ్చు.  ఇంకా ముందు తరం అంటే మీరు ఆలోచించి చెప్పే సమాధానం నందమూరి తారక రామారావు ( ఎన్.టి.ఆర్) తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు కూడా. తెలుగు ప్రజల్లో ఉన్న బలమైన అభిప్రాయం..


చలన చిత్ర రంగం నుంచి రాజకీయ ప్రవేశం చేసిన తొలి వ్యక్తి ఎవరూ అంటే తెలుగు పత్రికలు నేటికీ చెప్పే పేరు నందమూరి తారక రామారావు. ఆయన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.జి రామచంద్రన్ స్పూర్తితో రాజకీయ ప్రవేశం చేశాడని ప్రసార మాధ్యమాలు పేర్కోంటాయి. ఇది నిజం కూడా. దక్షిణ భారత దేశంలో చలన చిత్ర రంగం నుంచి తొలుత గా రాజకీయ ప్రవేశం చేసిన వారు వీరిద్దరూ మాత్రం కాదు. తమిళ నాట చలన చిత్ర రంగం నుంచి తొలిసారి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణా నిధి. ఆయన సినీ రచయిత. సినీ పాటలు, కథలు రాశారు. నాటక రంగం నుంచి చలన చిత్ర రంగంలో చిన్న చిన్న వేషాలు వేశారు. అయితే హీరో గా ఉన్న ఎం.జి.ఆర్ రాజకీయ ప్రవేశంతో కరుణానిధి పేరు వెనుకబడి పోయింది. కరుణానిధి ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి స్థాలిన్ కు స్వయానా తండ్రి. ఇక తెలుగు చిత్ర రంగం నుంచి తొలుత గా రాజకీయ ప్రవేశం చేసిన వ్యక్తి ఎవరంటే ఠక్కున వచ్చే సమాధానం... తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు. ఇదే విషయాన్ని పత్రికలూ నేటికీ ఘోషిస్తున్నాయి. ఇదీ మాత్రం శుద్ద అపద్దం..


  తెలుగు చలన చిత్ర రంగం నుంచి రాజకీయాలలోకి వచ్చి న తొలి వ్యక్తి  కొంగ జగ్గయ్య అలియాస్ కంచు కంఠం జగ్గయ్య .  ప్రముఖ సినీ, రంగస్థల నటుడు.  రేడియో తొలి తరం వార్తలు చదివిన వ్యక్తి, సీనియర్ పాత్రి కేయుడు.
నందమూరి రామారావు రాజకీయాల్లోకీ రాక మునుపే  జగ్గయ్య  నేరుగా ప్రజల నుంచి ఎన్నికయిన లోక్ సభ సభ్యుడు. ఇది ఎవరూ కాదన లేని సత్యం. చరిత్ర పాఠం. ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు. నాలుగవ లోక్ సభలో తెలుగు ప్రజల కష్టసుఖాలను యావత్ భారతావనికి వినిపించిన ఉత్తమ పార్లమెంటేరియన్. 1967 లో ఈయన ఎనభైవేల ఓట్ల మోజార్టీతో  విజయం సాధించి పార్లమెంట్ లోకి అడుగు పెట్టారు. ఒంగోలు నియోజక వర్గం అప్పడు  కమ్యూనిష్టుల కంచు కోట,  ఆ నియోజక వర్గం నుంచి  కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. అంతే కాదు లోక్ సభకు ఎన్ని కయిన తొలి సినీ నటుడుగా రికార్డు సృష్టించారు. భారత ప్రభుత్వం కొంగర జగ్గయ్యను 1992 లో ప్రతిష్టాత్మక పద్మ విభాషన్ తో సత్కరించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: