ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘రాథే శ్యామ్’ ఫస్ట్ కాపీ తయారు కావడంతో ఈ మూవీని ప్రభాస్ తన సన్నిహితులతో చూసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రవేట్ షోకు పూజ హెగ్డే తన కుటుంబ సభ్యులతో వచ్చినట్లు టాక్. ఈ ఫైనల్ కాపీని చూసిన తరువాత ప్రభాస్ పూర్తి సంతృప్తిని వ్యక్త పరచడమే కాకుండా ఈమూవీ తనకు ఖచ్చితమైన హిట్ ఇస్తుందని అభిప్రాయాన్ని తన సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది.హీరోయిన్ పూజ హెగ్డే కూడ ఈమూవీ చాల బాగా వచ్చిందని సంక్రాంతికి ఎన్ని సినిమాలు పోటీ ఉన్నప్పటికీ తమ మూవీకి ఎటువంటి సమస్య ఉండడు అంటూ ప్రభాస్ కు తన అభిప్రాయాన్ని తెలియచేసింది అని అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించి సముద్రంలో తీసిన 12 నిముషాల సీన్స్ ఈమూవీ విజయానికి అత్యంత కీలకంగా మారుతాయని ఈ మూవీని చూసిన ప్రభాస్ సన్నిహితులు అభిప్రాయ పడినట్లు తెలుస్తోంది.


ఈ మూవీలో ఫన్ రొమాన్స్ లవ్ లకు సంబంధించిన సీన్స్ చాల హార్ట్ టచ్చింగ్ గా రావడంతో ఈమూవీకి యూత్ తో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులు కూడ బాగా వస్తారు అన్న ధైర్యం ప్రభాస్ కు కల్గినట్లు తెలుస్తోంది. అయితే ఈమూవీ ‘ఆర్ ఆర్ ఆర్’ లాంటి అత్యంత భారీ అంచనాలు ఉన్న సినిమాతో పోటీ పడుతున్న పరిస్థితులలో ఈ మూవీ ప్రమోషన్ విషయంలో ఎలాంటి అశ్రద్ధ చేయకుండా ఒక నెల రోజుల పాటు మీడియాలో ఎక్కడ చూసినా ‘రాథే శ్యామ్’ వార్తలు పాటలు ఉండే విధంగా వ్యూహాలు రచించాలని ప్రభాస్ తన పీఆర్ టీమ్ కు సూచనలు ఇచ్చినట్లు టాక్.మూవీ పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ మూవీ ప్రమోషన్ ను కేవలం ముంబాయ్ లో మాత్రమే కాకుండా ఉత్తరాది చెందిన అన్ని ప్రముఖ నగరాలలోను నిర్వహించి అక్కడి యూత్ లో ఈ మూవీ పై అంచనాలు పెంచాలని ప్రభాస్ వ్యూహం అని అంటున్నారు. ప్రభాస్ నేషనల్ సెలెబ్రెటీ స్థాయిని కల్పించింది రాజమౌళి. అలాంటి తన గురువు రాజమౌళితో ఇప్పుడు ప్రభాస్ వార్ కు దిగడంతో ఈ గురు శిష్యుల వార్ లో ఫైనల్ విజేత ఎవరు అన్న ఆశక్తి అందరిలోనూ ఉంది..మరింత సమాచారం తెలుసుకోండి: