
దీంతో ఈమె గుడ్ లక్ సఖి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చినా..ఈ సినిమా కూడా బెడిసికొట్టిందని చెప్పవచ్చు. సుమారుగా మహానటి మినహాయిస్తే ఈమె నటించిన అన్ని లేడి ఓరియెంటెడ్ చిత్రాలు కూడా నిరాశపరిచిన సమయంలో ఇక ఈమె మరోసారి లేడీ ఓరియెంటెడ్ సినిమా అంటే వద్దని చెప్పాలి అని ఆమె అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ సమయంలోనే ఈమె నటించిన మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా కూడా ఓటీటీ కి సిద్ధం అంటూ తాజాగా ప్రముఖ ప్రకటన వచ్చింది.
ఇక తమిళ మీడియా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం చూసుకుంటే ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ అలాగే కీర్తి సురేష్ కీలక పాత్రలు పోషించిన సాని కాయిధం సినిమా థియేటర్లలో విడుదల చేయకుండా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు.. ఎప్పటినుంచో థియేటర్లలో విడుదల చేయాలని చూసిన ఈ సినిమా వాయిదాపడుతూ రావడం వల్ల ఏకంగా అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను కూడా అమెజాన్ కు అమ్మేసారు మేకర్ లు అనే వార్తలు వినిపిస్తున్నాయి. కీర్తి సురేష్ వరుస డిజాస్టర్ లను చవిచూసిన నేపథ్యంలో తక్కువ బడ్జెట్తో ఈ సినిమాను కొనుగోలు చేశారట. ఈ సినిమాతోనైనా ఈమె విజయాన్ని సాధిస్తుందో లేదో అని మనం వేచి చూడక తప్పదు అని అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి