టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రయోగాత్మక సినిమాలు చేసే హీరోగా శర్వానంద్ కు మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఈ విధమైన సినిమాలు ఎక్కువగా చేయడం వల్లనే ఆయనకు ఎక్కువ ఫ్లాపులు వచ్చాయి. అయినా కూడా ఆయనకు ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో క్రేజ్ ఉంది. ఒకప్పుడు హిట్ ల మీద హిట్లు చేస్తూ పోయే ఈ హీరో ఇప్పుడు వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు కూడా భారీ స్థాయిలో నిరాశపరిచిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన నటిస్తున్న ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రం పై ఎన్నో ఆశలు ఉన్నాయి ప్రేక్షకులలో.

కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా మొదటినుంచి ఆమె అభిమానులు ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. దీంతో కచ్చితంగా ఈ సినిమాతో హిట్ కొడతాననే నమ్మకం చిత్ర యూనిట్ లో ఉంది. అయితే ఈ సినిమా తర్వాత ఒకే ఒక జీవితం అనే సినిమా చేస్తుండడం.. అది మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా కావడం విశేషం. టైమ్ ట్రావెలింగ్ కాన్సెప్టుతో వస్తున్న ఈ సినిమా ఇటీవల కాలంలో ఈ జోనర్ సినిమా తెలుగు ప్రేక్షకుల మునుకు రాని నేపథ్యంలో సరికొత్త కాన్సెప్ట్ ఉన్న ఈ చిత్రం  తప్పకుండా అందరినీ అలరిస్తుందని భావిస్తున్నారు. 

ఇక శర్వా ఆయన తదుపరి సినిమాను కూడా లైన్ లో పెడుతున్నాడు. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజు సుందరం ఎన్నో సినిమాలకు కొరియోగ్రాఫర్ గా వర్క్ చేశారు. ఆ విధంగా ఎంతోమందికి ఆయన ఫేవరెట్ డాన్స్ మాస్టర్ గా ఉన్న నేపథ్యంలో కొన్నాళ్లుగా డైరెక్టర్ గా చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం అజిత్ హీరోగా తమిళంలో ఓ సినిమా డైరెక్ట్ చేశారు. అది ప్రేక్షకులను మెప్పించక పోవడం తో మళ్లీ దర్శకుడిగా అవకాశాలు రాలేదు. అయినప్పటికీ ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నారు. మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల కోసం కథలు తయారు చేసుకోగా ఆయన ఇప్పుడు శర్వా తో సినిమా చేయడానికి ముందుకు రావడం విశేషం. ఇటీవల ఆయన చెప్పిన కథ శర్వానంద్ కూడా నచ్చడం జరిగింది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: