జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ చాలా బిజీగా ఉన్నారు.. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో..RRR మూవీ లో మల్టీ స్టారర్ గా నటించారు. ఈ మూవీ ఈ ఏడాది మార్చి 25 వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది.. ఇక ఇందులో మరొక కథానాయకుడు రామ్ చరణ్ కూడా తన తదుపరి సినిమా పైన దృష్టి వ్యక్తి షూటింగ్లో చాలా బిజీగా ఉన్నాడు.. అయితే ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న 30 వ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో ఒక తెలుగు హీరోయిన్ నటించబోతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి వాటి గురించి చూద్దాం.


ఎన్టీఆర్ ఇందులో ఒక స్టూడెంట్ లీడర్ పాత్రను కనిపించబోతున్నట్లు గా సమాచారం. ఇదివరకు ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో జనతాగ్యారేజ్ మూవీ రాగ అది మంచి ఘన విజయాన్ని అందుకుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా అవుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్క సినిమాలో కచ్చితంగా ఒక ఐటెం సాంగ్ ఉండేలా చూసుకుంటున్నారు దర్శక,నిర్మాతలు. ఇక ఇలాంటి పాటకి స్టార్ హీరోయిన్లు సైతం డ్యాన్సులు వేయించేలా ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం. ఇక తాజాగా పుష్ప సినిమాలో కూడా సమంత డాన్స్ వేసిన సంగతి అందరికీ తెలిసిందే.


ఇక ఈ తరహాలోనే ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న మూవీకి కూడా ఒక స్పెషల్ సాంగ్ ఉండబోతోందట. ఆ సాంగ్ లో ఒక స్టార్ హీరోయిన్ సందడి చేయబోతోంది అంటు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆమె ఎవరో కాదు హీరోయిన్ సమంతనే అనే పేరు వినిపిస్తోంది.. అంతేకాకుండా చిత్రబృందం కూడా ఈమెతో చర్చలు జరిపిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే

మరింత సమాచారం తెలుసుకోండి: