ఈ చిత్రని డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో వహిస్తున్నారు. ఈ సినిమా కూడా మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్ టైన్ మెంట్ గా తెరకెక్కించడం జరుగుతోందట. ఈ సినిమాలో చాందినీ చౌదరి కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ విడుదల కాక ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పటికే చిత్రబృందం రెండు పాటలను కూడా విడుదల చేయగా అవి సూపర్ హిట్ గా నిలిచాయి. UG ప్రొడక్షన్లో కంకణాల ప్రవీణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో చాలా బిజీగా ఉన్నారు చిత్రబృందం. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించడం జరిగింది.
ఈ సినిమా జూన్ 24వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కు సిద్ధంగా ఉన్నది. ఈ సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ పోస్టర్ విషయానికి వస్తే హీరోయిన్ చాందిని గార్డెన్లో బట్టలు ఆరవేసే ఉన్నప్పుడు కిరణ్ ఆమెను ప్రేమగా కౌగిలించుకున్న ట్లు గా తెలుస్తోంది. ఇక చాందిని కిరణ్ ఎంతో హ్యాపీ మీ స్మైల్ తో కనిపించడం జరుగుతోంది. ఇక వీరిద్దరి కెమిస్ట్రీ ఈ సినిమాలో చాలా అద్భుతంగా కుదిరింది. సతీష్ రెడ్డి సినిమాటోగ్రాఫర్గా ఈ సినిమాకి పని చేస్తున్నారు. ఇక ఈ సినిమా మరి ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు చిత్రబృందం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి