లేటెస్ట్ గా విడుదలైన ‘విరాటపర్వం’ చూసిన ప్రతి వ్యక్తి సాయి పల్లవిని ఆకాశానికి ఎత్తేస్తూ పొగిడారు. ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో సాయి పల్లవి అభిమానులు లేడీ పవర్ స్టార్ అంటూ చేసిన హంగామాకు ఇండస్ట్రీ వర్గాలు కూడ ఆశ్చర్యపోయాయి. అయితే ఆసినిమా మొదటివారం గుర్తు చేసుకునే సమయానికి 5 కోట్లు కూడ వసూలు చేయలేని స్థితిలోకి వెళ్ళడం పరిశీలిస్తున్న వారికి  సాయి పల్లవికి ప్రేక్షకులను ధియేటర్లకు రప్పించుకునే శక్తి లేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


వాస్తవానికి ‘ఫిదా’ మూవీ తరువాత సాయి పల్లవికి చెప్పుకోతగ్గ కమర్షియల్ హిట్ లేదు. గత సంవత్సరం ‘లవ్ స్టోరీ’ విజయవంతం అయినప్పటికీ ఆసినిమాకు చెప్పుకోతగ్గ స్థాయిలో కలక్షన్స్ రాలేదు. ఇలా సాయి పల్లవి నటించిన సినిమాలు అన్నీ రకరకాల కారణాలతో కలక్షన్స్ తెచ్చుకోలేక పోయాయి. సరిగ్గా ఇలాంటి పరిస్థితి కీర్తి సురేష్ విషయంలో కూడ ఎదురౌతోంది.


‘మహానటి’ మూవీ తరువాత ఆమె నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు అన్నీ ఫ్లాప్ అయ్యాయి. దీనితో ఇక లాభం లేదనుకుని తన లుక్ ను మార్చుకుందామని డైటింగ్ చేసి రోజు సూర్య నమస్కారాలు చేసి జీరో సైజ్ లోకి మారి ‘సర్కారు వారి పాట’ లో కనిపిస్తే ఆమె లుక్ బాగాలేదు అంటూ కామెంట్స్ వచ్చాయి. ఆమె పద్దతికి విరుద్ధంగా ఈమూవీలో ఆమె మహేష్ పక్కన గ్లామర్ గా కనిపిస్తూ ఎక్స్ పోజింగ్ చేసినా యూత్ పట్టించుకోలేదు. దీనితో కీర్తి సురేష్ కష్టం అంతా వృధా అయిపోయింది.


ఒకవైపు 35 సంవత్సరాలు దాటిపోయినా సమంతా నయనతార లు గ్లామర్ క్వీన్స్ గా కొనసాగుతూ బలం ఉన్న కథలతో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలలో రాణిస్తూ విజయాలు అందుకుంటున్నారు. అలాంటి పరిస్థితి ఎంతో టాలెంట్ ఉన్న సాయి పల్లవి కీర్తి సురేష్ లకు ఎందుకు లేదు అంటూ కొంతమంది విశ్లేషణలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి మరికొంత కాలం వీరిద్దరికీ ఎదురైతే ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ వీరు రాణించడం కష్టం అన్న అభిప్రాయాలు కొందరు వ్యక్తపరుస్తున్నారు..
మరింత సమాచారం తెలుసుకోండి: