ప్రస్తుతం ఉన్న జనరేషన్ చాలా స్పీడ్ గా ఉంటోంది. పాత తరాలకు అంత సులువుగా ఈ స్పీడును అందుకోలేరు. ప్రస్తుతం సోషల్ మీడియా డిజిటల్ విప్లవాలు ఎక్కువగా పెరిగిపోయాయి. కొందరితో పోలిస్తే ఇలాంటి వాటిని ఇలాగే చెప్పవచ్చు ప్రస్తుతం జనరేషన్లో పూర్తిగా వెనుకబడి ఉన్న హీరోయిన్ శ్రీనిధి శెట్టి. ఈమె పాన్ ఇండియా సినిమా అయినా కేజిఎఫ్ చిత్రంలో నటించింది అయినా ఈమెలో ఉన్న లోపం ఏంటో ఇప్పుడు చూద్దాం.


కే జి ఎఫ్, కే జి ఎఫ్ -2 లాంటి చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకుంది అలాగే టాలీవుడ్ లో కూడా వరుస సినిమాలను ఒప్పుకుంటూ సంతకాలు చేస్తోందని అందరూ అనుకున్నారు..కానీ తన కెరియర్ అందుకు పూర్తి భిన్నంగా ఉందని చెప్పవచ్చు. తన చుట్టూ ఉన్న హైప్ ని క్యాష్ చేసుకోలేకపోతోంది ఈ ముద్దుగుమ్మ. వాస్తవానికి అందానికి అందం నటనపరంగా ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ ఈ ముద్దుగుమ్మ కి కేవలం ప్రణాళికలోపం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. బ్లాక్ బస్టర్ చిత్రమైన కేజీఎఫ్ సినిమాతో శ్రీనిధి శెట్టి ఆశించినంత ప్రచారం జరగలేదు.

ఇక అంతే కాకుండా తన కెరీర్ ప్రారంభంలోనే అత్యధిక రెమ్యునరేషన్  డిమాండ్ చేస్తుంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి దీంతో ఈమెకు అవకాశాలు కూడా తగ్గుతున్నాయి అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా సౌత్ నుండి పలు అవకాశాలు వచ్చినా కూడా వాటిని వదులుకుందనే టాక్ వినిపిస్తోంది. అవి కూడా రేమ్యూరేషన్ విషయంలోనే మిస్ అయ్యాయని కూడా వినిపిస్తున్నాయి.

కారణం ఏదైనా కానీ అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా తడబడుతోంది శ్రీనిధి. అయితే శాండిల్ వుడ్ లో అయినా ఈమెకు పలు అవకాశాలు వస్తున్నాయా.. రాలేదా అన్న విషయం ఇంకా తెలియలేదు. ఎంతోమంది హీరోయిన్లు సైతం సినిమా హిట్ అవ్వగానే క్రేజ్తో బాలీవుడ్లో అడుగు పెడుతున్నారు కానీ శ్రీనిధి శెట్టి మాత్రం అలాంటి ప్రయత్నాలు చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: