అమీర్ ఖాన్ హీరోగా ఇంకా నాగ చైతన్య ముఖ్య పాత్రలో నటిస్తున్న సినిమా లాల్ సింగ్ చద్దా. ఫారెస్ట్‌ గంప్‌ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు.ఇక ఇటీవల తెలుగు సినిమాలు బాగా హిట్ అవుతుండటంతో బాలీవుడ్ సినిమాలన్నీ కూడా తెలుగులో మార్కెట్ కోసం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. లాల్ సింగ్ చడ్డా సినిమాలో నాగ చైతన్య కూడా ఉండటంతో తెలుగులో కూడా ప్రమోషన్స్ చాలా భారీగా చేస్తున్నారు. ఇక ఈ సినిమాని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేస్తున్నారు. ఆదివారం నాడు సాయంత్రం లాల్ సింగ్ చడ్డా ప్రెస్ మీట్ జరుగగా దీనికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా వచ్చారు. ఈ ప్రెస్ మీట్ లో చిరంజీవి అమీర్ ఖాన్ గురించి ఇంకా తెలుగు సినిమాల గురించి గొప్పగా మాట్లాడారు.ఇక ఈ ప్రెస్ మీట్ లో అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. ”నా మీద ప్రేమతో తెలుగులో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి చిరంజీవి గారు ముందుకొచ్చారు.


ఇక అది నాకెంతో గౌరవం. నా సినిమాలు గతంలో కూడా తెలుగు ఇంకా తమిళంలో రిలీజ్ అయ్యాయి కానీ చాలా తక్కువ మందికి చేరువయ్యాయి. ఇటీవల సౌత్ సినిమాలు హిందీలోచాలా బాగా ఆడుతున్నాయి. అందుకే చిరంజీవి గారిని సాయం కోరాను. లాల్ సింగ్ చడ్డా సినిమాని తెలుగులో విడుదల చేసి, మరింత ఎక్కువ మందికి చేరువయ్యేలా చూడమని చిరంజీవి గారిని అడిగాను. ఆయన ఇక వెంటనే ఒప్పుకున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్‌ రచనకే మొత్తం 8 ఏళ్ల సమయం పట్టింది. 'ఫారెస్ట్‌ గంప్‌' సినిమాతో పోలిస్తే ఇందులో చాలా మార్పులు చేశాం. కార్గిల్‌లో నేనూ ఇంకా నాగచైతన్య కలిసి ఒక నెల రోజులపాటు షూటింగ్ లో పాల్గొన్నాం. ప్రతి రోజూ కార్లో ప్రయాణం చేస్తూ మేం రెండు గంటలు మాట్లాడుకునేవాళ్లం. చైతూ నాకు చాలా మంచి స్నేహితుడయ్యాడు” అని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: