‘బింబిసార’ మూవీని కొనుక్కున్న బయ్యర్లు మంచి జోష్ లో ఉన్నారు. ఈసినిమాను చాలతక్కువ లాభంతో కళ్యాణ్ రామ్ బయ్యర్లకు అమ్మడంతో ఈమూవీకి వచ్చిన టోటల్ పాజిటివ్ టాక్ తో ఈమూవీ బయ్యర్లకు వీకెండ్ పూర్తి అయ్యేసరికే లాభాల బాట పట్టినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారంమేరకు ఈవీకెండ్ పూర్తి అయ్యేసరికీ ఈమూవీకి 15 కోట్లు నెట్ కలక్షన్స్ వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.


ఈమూవీ కథ విషయంలో చిన్నచిన్న అతిశయోక్తులు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా సగటు ప్రేక్షకుడు ఈమూవీకి హిట్ టాక్ ఇవ్వడంతో కళ్యాణ్ రామ్ కోరుకున్న సూపర్ హిట్ అతడికి దక్కింది. ఈమూవీ చూసిన ప్రతి ప్రేక్షకుడు కళ్యాణ్ రామ్ బింబిసార పాత్రలో చేసిన అద్భుతమైన నటనను చూసి ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈమూవీకి సంబంధించి ఒక లోటు మాత్రం సగటు ప్రేక్షకులకు బాగా కనిపిస్తోంది.


ఈసినిమాకు సంగీత దర్శకుడుగా కీరవాణి పనిచేసినప్పటికీ ఎందుకో అతడు ఈమూవీ పై పూర్తిగా శ్రద్ధపెట్టలేదు అన్న కామెంట్స్ వస్తున్నాయి. ‘మగధీర’ లాంటి ప్యాంటసీ కథ ‘బింబిసార’ లో ఉన్నప్పటికీ ఆకథను హైలెట్ చేసే విధంగా పాటలు లేకపోవడం ఒకవిధంగా ‘బింబిసార’ ను సూపర్ హిట్ స్థాయికి తీసుకువెళ్ళలేకపోయిందా అన్నమాటలు వినిపిస్తున్నాయి.


అయితే ఇలాంటి ప్యాంటసీ సినిమాలకు కీలకంగా కనిపించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కీరవాణి తన ప్రతిభను చూపెట్టాడు. పాటల ట్యూనింగ్ మరింత బాగా ఉంటే ఈమూవీ హిట్ రేంజ్ మరోస్థాయిలో ఉండేది అంటున్నారు. ఏది ఎలా ఉన్నా ఈమూవీని కొనుక్కున్న బయ్యర్లకు రూపాయికి రూపాయి రావడం ఖాయం అని అంటున్నారు. కళ్యాణ్ రామ్ మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు కాబట్టి తాను ఒప్పుకునే సినిమాల కథల విషయంలో కొంచం జాగ్రత్తగా వ్యవహరిస్తే ‘బింబిసార’ ఇచ్చిన జోష్ అతడికి ఎక్కువకాలం నిలబడే ఆస్కారం ఉంది. ఈమూవీ సక్సస్ ఇచ్చిన జోస్జ్ తో కళ్యాణ్ రామ్ కలలు కంటున్న బాలకృష్ణ జూనియర్ ల మల్టీ స్టారర్ ఎంతవరకు తీయగలడో చూడాలి..




మరింత సమాచారం తెలుసుకోండి: