ప్రస్థుతం ఇండస్ట్రీలో ఎక్కడ విన్నా హను రాఘవపూడి గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నారు. ఒకనాటి తరం ప్రేక్షకులు ‘మరోచరిత్ర’ సినిమాను చూసి ఆతరువాత ‘గీతాంజలి’ సినిమాను చూసి మైమరిచి పోయినట్లుగా నేటితరం  ప్రేక్షకులు ఎక్కడ చూసినా ‘సీతా రామం’ సినిమా గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నారు.


ఈవారం చాల సినిమాలు విడుదల అవుతున్నప్పటికీ ప్రేక్షకులు మాత్రం ‘సీతా రామం’ మ్యానియాలోనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో అనేకమంది నిర్మాతలు హను రాఘవపూడి వైపు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం నాని పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. దసరాకు విడుదల కాబోతున్న ‘దసరా’ కూడ ఫెయిల్ అయితే నాని పరిస్థితి మరింత అయోమయంగా మారుతుంది.


దీనితో నాని తో సినిమాలు తీయాలి అని ఆరాట పడేవారి సంఖ్య బాగా తగ్గుతున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితులలో ఇప్పటికే నానీకి అడ్వాన్స్ ఇచ్చిన ఒక ప్రముఖ నిర్మాత నాని హను రాఘవపూడిల కాంబినేషన్ సెట్ చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’ మూవీ కోసం వీరిద్దరూ పనిచేసారు. అయితే ఆసినిమా చెప్పుకోతగ్గ హిట్ కాదు. ఇప్పుడు మళ్ళీ ఈ కాంబినేషన్ ను సెట్ చేస్తే మార్కెట్ చాల సులువుగా అవుతుంది అన్న ఆలోచన ఆప్రముఖ నిర్మాతకు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.


అయితే నానికి నచ్చే కథ హను రాఘవపూడి వద్ద ఉందా అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా నాగచైతన్య కూడ హను రాఘవపూడి వైపు చూస్తున్నట్లుగా వార్తలు వస్తున్న పరిస్థితులలో ఈ సెన్సిబుల్ డైరెక్టర్ ఎవర్ని ఎంచుకుంటాడు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. దీనికితోడు చాల ప్రముఖ నిర్మాణ సంస్థలు హను రాఘవపూడి ని కలిసి భారీ అడ్వాన్స్ లు ఇచ్చి తమకు సినిమాలు చేసిపెట్టమని అడుగుతున్నప్పటికీ హను ఏమాత్రం ఖంగారు పడకుండా మంచి కథలు తన మనసులోకి వచ్చినప్పుడు టచ్ లోకి వస్తాను అంటూ చెప్పి తెలివిగా తప్పించుకుంటున్నట్లు టాక్...


మరింత సమాచారం తెలుసుకోండి: