యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలలో ఆదిపురుష్ సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే. ఇప్పటివరకు కూడా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ కూడా విడుదల కాకపోయినా 2023 సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా కొరకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమా కోసం ఏకంగా 500 కోట్ల రూపాయలను నిర్మాతలు ఖర్చు చేయగా శాటిలైట్ ఇంకా డిజిటల్ హక్కుల ద్వారా నిర్మాతలకు భారీస్థాయిలో ఆదాయం వచ్చిందని సమాచారం తెలుస్తోంది. ఆదిపురుష్ తెలుగు రాష్ట్రాల హక్కులు ఏకంగా 100 కోట్ల రూపాయలకు పైగా అమ్ముడయ్యాయని సమాచారం తెలుస్తుంది. మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమా అయినా ఈ స్థాయిలో థియేట్రికల్ హక్కులు అమ్ముడవడం కేవలం ప్రభాస్ కు మాత్రమే సాధ్యమని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నారు. మరోవైపు ప్రభాస్ నటించిన సలార్ సినిమా నుంచి రేపు మధ్యాహ్నం ఒక అప్డేట్ కూడా రానుందని అధికారిక ప్రకటన వెలువడింది.


ఈ అప్డేట్ తో పాటు సలార్ మూవీ రిలీజ్ డేట్ కు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వస్తుందని ప్రభాస్ అభిమానులు భావిస్తున్నారు. ప్రభాస్ సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలుగా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. ఇక రాజమౌళి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బాహుబలి2 సినిమా ఏకంగా 1800 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించడంతో ప్రభాస్ తో సినిమాలను నిర్మించే నిర్మాతలెవరూ కూడా ఖర్చు విషయంలో రాజీ పడటం లేదు. సాహో ఇంకా రాధేశ్యామ్ సినిమాలు ఫ్లాప్ అయినా ప్రభాస్ కు ఉన్న క్రేజ్ వల్లే ఈ సినిమాలకు భారీ మొత్తంలో నష్టాలు రాలేదు. ప్రభాస్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ లతో ఇండస్ట్రీ హిట్లు సాధించి కొత్త రికార్డులను క్రియేట్ చేయాలని ఆయన అభిమానులు భావిస్తున్నారు. ఇక ప్రభాస్ తర్వాత ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: