మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ చిత్రం ప్రేక్షకులను అలరిండానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ఈ సినిమా పై ఏ మాత్రం బజ్ రావడం లేదు అనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆచార్య సినిమా దారుణమైన పరాజయం కావడంతో ఈ సినిమాపై ఆ సినిమా యొక్క ప్రభావం పడిందని ప్రతి ఒక్కరు కూడా భావించారు. ఆ విధంగానే ఈ సినిమాపై ఎలాంటి బజ్ పోవడం ఒక్కసారిగా మెగా అభిమానులను ఎంతగానో నిరాశ పరుస్తుంది.

సినిమా తప్పకుండా మంచి విజయం సాధించాలని అప్పుడే మెగా అభిమానుల పరువు నిలబడు తుందని వారు చెప్పుకుంటున్నారు. అయితే దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలను షురూ చేయడం మెగా అభిమానులలో కొత్త ఉత్సాహాన్ని రేకత్తిస్తుంది. ఇప్పటికే ఈనెల 25వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల చేస్తామని చిత్ర బృందం చెప్పింది .

అంతేకాదు 28వ తేదీన ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తో కూడా చేస్తామని సినిమా బృం దం వెల్లడించింది. దానికి సంబంధించిన పనులు కూడా శెరవేగంగా జరుగుతున్నాయి. అనంతపూర్ లో ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహిస్తుంది చిత్ర బృం దం. ఈ విధంగా సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలలో వేగం పెంచడం ఒక్కసారిగా మెగా అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోతుంది. మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా లో నయనతార ఓ కీలక పాత్రలో నటిస్తూ ఉండగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ లో నటిస్తూ ఉండడం విశేషం. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి తక్కువ వ్యవధిలోనే తాను నటిస్తున్న మరొక రెండు సినిమాలను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: