నాగచైతన్య తో సమంత విడిపోయిన తరువాత సమంత క్రేజ్ పై కొందరికి ఏర్పడిన సందేహాలకు ఆమె ‘పుష్ప’ లో చేసిన ఐటమ్ సాంగ్ ట్రెండింగ్ గా మారడంతో ఇక ఆమెకు ఎదురులేదు అని అనుకున్నారు అంతా. దీనికితోడు ఆమెకు బాలీవుడ్ లో కూడ అవకాశాలు వస్తూ ఉండటంతో సమంత బాలీవుడ్ టాలీవుడ్ లను షేక్ చేస్తుంది అన్న అభిప్రాయం ఆమె అభిమానులకు ఏర్పడింది.

 

 అయితే టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో జరుగుతున్న పరిమాణాలు సమంత మ్యానియాకు సహకరించేవిగా కనిపించడం లేదు అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. దీనికి కారణం ఆమె నటించిన ‘యశోద’ మూవీ టీజర్ కు ఇండస్ట్రీ వర్గాల నుండి పెద్దగా క్రేజ్ ఏర్పడక పోవడంతో ఆమూవీ బిజినెస్ అంతంతమాత్రంగా జరుగుతోంది అంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

 వాస్తవానికి ఈమూవీ విడుదలకు ఎప్పుడో రెడీగా ఉన్నప్పటికీ ఈ మూవీ బిజినెస్ జరగడంలో ఆలస్యం అవుతూ ఉండటంతో ఈ మూవీ విడుదల పై సరైన క్లారిటీ లేదు అంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇది చాలదు అన్నట్లుగా సమంత భారీ అంచనాలతో నటించిన ‘శాకుంతలం’ మూవీ పరిస్థితి కూడ అలాగే ఉంది అంటున్నారు. ఈమూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తి అయినప్పటికీ మూవీ విడుదల తేదీ పై గుణశేఖర్ క్లారిటీ ఇవ్వలేకపోతున్నాడు. దీనికికారణం ఈమూవీ బిజినెస్ కు కూడ ఆశించిన స్థాయిలో జరగడంలేదు అన్న గాసిప్పులు కూడ వస్తున్నాయి.

 

 దీనితో సమంత నటించిన సినిమాలకు బిజినెస్ ఎందుకు అవ్వడం లేదు అంటూ కొందరు ఆశ్చర్య పడుతున్నారు. దీనికితోడు సమంత ను హీరోయిన్ గా తీసుకోవడానికి టాప్ యంగ్ హీరోల దర్శక నిర్మాతలు కూడ పెద్దగా ఆశక్తి కనపరచడం లేదు అన్న కామెంట్స్ కూడ వస్తున్నాయి. జూనియర్ కొరటాల కాంబినేషన్ మూవీలో సమంత హీరోయిన్ గా నటించబోతోంది అంటూ వార్తలు వచ్చినప్పటికీ ఆవార్తల పై ఎటువంటి క్లారిటీ ఇప్పటి వరకు లేకపోవడంతో సమంత ఊహించుకున్న స్థాయిలో ఇప్పుడు ఆమె మార్కెట్ లేదా అంటూ కొందరు సందేహాలు వ్యక్తత పరుస్తున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: