టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లో కూడా మంచి వసూళ్లు నమోదు చేస్తుందని చిత్ర బృందం పలు ఫేక్ లెక్కలు చెబుతూ జనాలను నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వంద కోట్లకు పైగానే ఈ సినిమా వసూళ్లు సాధించిందని చెప్పుకుంటున్నారు. కానీ ఇందులో ఎలాంటి నిజాలు లేవు. సినిమాకి హిట్ టాక్ వచ్చిన వసూళ్లు మాత్రం చాలా దారుణంగా వున్నాయి.అయితే గాడ్ ఫాదర్ సినిమా వీకెండ్ పూర్తి అయ్యేప్పటికి 1.1 మిలియన్ డాలర్ల వసూళ్లను దక్కించుకున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇంకా భారీగానే వసూళ్లు నమోదు అవుతున్నాయని.. వచ్చే వీకెండ్ వరకు మరో అరుదైన మైలు రాయిని కూడా యూఎస్ బాక్సాఫీస్ వద్ద  గాడ్ ఫాదర్ సినిమా చేరుకునే అవకాశం లేక పోలేదు అంటూ ప్రచారం జరుగుతోంది.


చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత దాదాపు సినిమాలు కూడా యూఎస్ బాక్సాఫీస్ వద్ద మిలియన్ మార్క్ ను క్రాస్ చేయడం కామన్ విషయం గా మారింది. యూఎస్ లో మెగా అభిమానుల సందడి అంతా ఇంతా కాదు. చిరంజీవి సినిమా వస్తుంది అంటూ అక్కడ జోరు.. జోష్ ఓ రేంజ్ లో ఉంటుంది. అందుకే ఈజీగా సినిమా మిలియన్ మార్క్ ను క్రాస్ చేస్తోంది.మలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ కి రీమేక్ గా రూపొందిన గాడ్ ఫాదర్ సినిమాలో ముఖ్యమైన గెస్ట్ రోల్ లో సల్మాన్ ఖాన్ నటించిన విషయం తెల్సిందే.ఇక నయనతార ఇంకా సత్యదేవ్ లు కీలక పాత్రలో నటించి మెప్పించారు. ఒక పొలిటికల్ డ్రామా నేపథ్యంలో రూపొందిన గాడ్ ఫాదర్ తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.ఐతే జనాల సంఖ్య బాగా తగ్గిపోతుంది.చాలా ఏరియాల్లో సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు. కొన్ని చోట్ల చాలా నష్టాలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: