
చిరంజీవి మరియు రజినీకాంత్ మంచి స్నేహితులు అనే విషయం మన అందరికి తెలిసిందే..పాత రోజుల్లో వీళ్లిద్దరు కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు కూడా..చిరంజీవి సినిమాలను రజినీకాంత్ మరియు రజినీకాంత్ సినిమాలను చిరంజీవి చూసుకుంటూ ప్రశంసించుకుంటూ ఉంటారు..అలా లేటెస్ట్ గా మెగాస్టార్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన గాడ్ ఫాదర్ సినిమాని చూసిన రజినీకాంత్ చిరంజీవి కి ఫోన్ చేసి ప్రశంసలతో ముంచి ఎత్తారట..అంతే కాకుండా తనతో పేట సినిమా తీసిన కార్తీక్ సుబ్బరాజ్ నీ కోసం ఒక అద్భుతమైన కథ రాసాడు..నాకు కూడా వినిపించాడు..చాలా బాగా అనిపించింది..నీకు ఇంకా ఆ కథ చెప్పలేదా అని చిరంజీవి ని రజినీకాంత్ అడగగా, దానికి చిరంజీవి సమాధానం చెప్తూ 'అవునా..నా దగ్గరకి అతను ఇంకా రాలేదు' అని బదులిచ్చాడట..అప్పుడు రజినీకాంత్ 'అతనితో సినిమా చెయ్యి..అద్భుతంగా తీస్తాడు..మనలోని వింటేజ్ యాంగిల్ ని బయటకి లాగడమే అతని స్పెషలిటీ' అని చెప్పాడట.రజినీకాంత్ అలా చెప్పడం తో వెంటనే చిరంజీవి కార్తీక్ సుబ్బరాజ్ కి ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకొని అతను తనకోసం రాసుకున్న కథని వినిపించుకున్నాడట..కథ విని ఎంతో ఆకర్షితుడైన చిరంజీవి ఈ సినిమా చెయ్యడానికి వెంటనే అంగీకరించాడట..మరి పేట సినిమాతో వింటేజ్ రజినీకాంత్ ని వెండితెర మీద చూపించి అభిమానులకు పండగ తెచ్చిన కార్తీక్ సుబ్బరాజ్..చిరంజీవి ని ఎలా చూపించబోతున్నాడా చూడాలి.