టాలీవుడ్  లెజెండరి స్టార్  హీరో నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా ఇంకా 'కింగ్' నాగార్జున నట వారసుడిగా అక్కినేని ఫ్యామిలీ నుండి 3వ తరం హీరోగా 'జోష్' సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య. నవంబర్ 23న అనగా ఈరోజు నాగ చైతన్య పుట్టినరోజు. ఈ సందర్భంగా చైతన్య సినిమా విషయాలతో పాటు పర్సనల్ లైఫ్‌కి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..2009లో 'జోష్' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య రెండో సినిమా 'ఏమాయ చేశావే' తో మంచి హిట్  కొట్టి యూత్ ఆడియన్స్‌కి బాగా దగ్గరై, '100%లవ్' సినిమాతో టాలీవుడ్ లో ప్రత్యేకంగా లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. 'దడ, బెజవాడ, ఆటోనగర్ సూర్య, తడాఖా' వంటి సినిమాల్లో తనలోని మాస్ యాంగిల్ కూడా చూపించి మాస్ హీరోగా కూడా నిరూపించుకున్నాడు.అలాగే 'సాహసం శ్వాసగా సాగిపో, యుద్ధం శరణం, ఒక లైలా కోసం, దోచెయ్, రారండోయ్ వేడుకచూద్దాం, శైలజా రెడ్డి అల్లుడు, సవ్యసాచి' వంటి సినిమాలతో అభిమానులను ఆకట్టుకోవడంతో పాటు ఫ్యామిలీ హీరో ఇమేజ్ కూడా నాగ చైతన్య తెచ్చుకున్నాడు.


తాత, తండ్రి, తమ్ముడితో కలిసి నటించిన 'మనం', మేనమామ విక్టరీ వెంకటేష్, తండ్రి నాగార్జున అతిథి పాత్రల్లో కనిపించి అలరించిన 'ప్రేమమ్', ఎమోషనల్ ఎంటర్‌టైనర్ 'మజిలీ' ఇంకా అలాగే వెంకటేష్‌తో కలిసి మల్టీ స్టారర్ చిత్రం 'వెంకీమామ'తో మెప్పించాడు. ఈ సినిమాలు అయితే చైతు కెరీర్లో చాలా ప్రత్యేకంగా నిలిచిపోతాయి.సినిమాల ఫలితాలు ఎలా వున్నా కూడా చైతన్యకి అభిమానులు మాత్రం అస్సలు తగ్గరు.బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ తో చైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ రిజల్ట్ సంగతి పక్కన పెడితే 'లాల్ సింగ్ చద్దా' లో తన నటనతో చాలా బాగా ఆకట్టుకున్నాడు.తన మేనమామ విక్టరీ వెంకటేష్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ప్రీతి జింటా, దీపికా పదుకోనె. అజిత్, సూర్య.. వీళ్లంతా నాగ చైతన్యకి తన తండ్రి తాత తరువాత చాలా ఇష్టమైన నటులు. అలాగే విరాట్ కోహ్లీ అంటే చైతూకి చాలా ఇష్టం..చైతన్యకి స్పోర్ట్స్  కార్లంటే పిచ్చి. తన గ్యారేజీలో రకరకాల స్పోర్ట్స్ బైక్స్ అండ్ కార్స్ ఉన్నాయి..చైతు రోడ్లు ఖాళీగా ఉండే టైం చూసుకుని.. హెల్మెట్ పెట్టుకుని హైదరాబాద్ రోడ్ల మీద రయ్ మంటూ దూసుకెళతాడంట.

మరింత సమాచారం తెలుసుకోండి: