‘బాహుబలి’ తో జాతీయస్థాయి గుర్తింపు తెచ్చుకున్న రానా కు ఆతరువాత ఆస్థాయి గుర్తింపును కొనసాగించే పాత్రలు రాలేదు. కొన్ని డిఫరెంట్ సబ్జక్ట్ లతో రానా కొన్ని విభిన్న పాత్రలలో నటించినప్పటికీ రానా కష్టానికి తగిన గుర్తింపు రాలేదు. ఆతరువాత ఆమధ్యలో రానా కు అనారోగ్య సమస్యలు రావడంతో రేసులో ప్రస్తుతానికి రానా కొంతవరకు వెనుకడుగులోనే ఉన్నాడు.
రానా కు అనారోగ్య సమస్యలు రాకముందు ‘హిరణ్యకశ్యప’ మూవీని భారీ బడ్జెట్ తో అంతర్జాతీయ స్థాయిలో తీయాలని రానా తండ్రి సురేష్ బాబు ఒక భారీ ప్రాజెక్ట్ ను ఆలోచించి ఆప్రాజెక్ట్ కు గుణశేఖర్ దర్శకుడుగా నియమించాడు. గుణశేఖర్ ఈమూవీ ప్రాజెక్ట్ కు దర్శకత్వం వహించడం ఒక అరుదైన అవకాశంగా తీసుకుని హిరణ్యకశ్యపుడు గురించి అనేక పురాణాలు రీసర్చి చేసి ఆమూవీకి సంబంధించి భారీ సెట్ డిజైన్స్ తో పాటు సుమారు 60 వేల డ్రాయింగ్ లతో ఈమూవీ ప్రాజెక్ట్ కోసం చాల శ్రమపడ్డాడు అని అంటారు. అయితే ఆ ప్రాజక్ట్ అటకెక్కింది.
ఇప్పుడు రానా తన అనారోగ్యం నుంచి తేరుకోవడంతో సురేష్ బాబు ఈమూవీ ప్రాజెక్ట్ గురించి త్రివిక్రమ్ శ్రీనివాస్ అభిప్రాయాన్ని తీసుకున్నట్లు టాక్. ఈప్రాజెక్ట్ కు సంబంధించిన అన్నివిషయాలను తెలుసుకున్న త్రివిక్రమ్ గతంలో వచ్చిన ‘భక్త ప్రహ్లాద’ కు జిరాక్స్ లా ఉందని త్రివిక్రమ్ సురేష్ బాబు దగ్గర అన్నట్లు గాసిప్పులు వచ్చాయి.
ఈస్క్రిప్ట్ కు సంబంధించి తాను కొన్ని మార్పులు చేర్పులు చేస్తానని త్రివిక్రమ్ సురేష్ బాబుతో అన్నప్పటికీ అతడు ఈ స్క్రిప్ట్ పై ఇప్పటికీ తన సూచనలు పూర్తిగా ఇవ్వలేదు అని అంటున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నాడు. ఆతరువాత బన్నీతో మరొక మూవీని చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇలాంటి పరిస్థితులలో అసలు ‘హిరణ్యకశ్యప’ స్క్రిప్ట్ పై దృష్టి పెట్టడానికి ఎంతవరకు త్రివిక్రమ్ కు అవకాశం ఉంటుంది అన్నసందేహాలు కొందరు వ్యక్త పరుస్తున్నారు. ఈపరిస్థితులు ఇలాఉండగా ‘విరాటపర్వం’ మూవీ విడుదల తరువాత చాలామంది దర్శకులు రానాను కలిసి తమ కథలు వినిపించాలి అని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కథ వినే విషయంలో రానా పెద్దగా ఆశక్తి కనపరచడం లేదని మరికొందరు అంటున్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి