
సినీ పరిశ్రమ మద్రాస్ లో ఉండడంతో అక్కడ ఉద్యోగం దొరికితే చాలు గాయకుడు అవ్వాలన్నా తనకల సహకారం అవుతుందనుకున్నాడు. కానీ బెంగళూరులో ఉద్యోగం వచ్చింది. అప్పటి పరిస్థితికి ఆయనకు ఉద్యోగమే చాలా ముఖ్యమైంది.. కాబట్టి బెంగళూరు వైపు మొగ్గు చూపాడు. అక్కడ ఒక గాయకుడితో పరిచయమై అక్కడక్కడ ఆర్కెస్ట్రాలలో పాడడం మొదలుపెట్టాడు. అక్కడ కన్నడ రచయిత శ్రీ చంద్ర, గాయని సుజాత పరిచయమయ్యారు.. అయితే వాళ్లు ఇతనికి శాస్త్రీయ సంగీత జ్ఞానం లేదు అని చెప్పడం ఇష్టం లేక పాటల రచయితగా ప్రయత్నించమన్నారు. అలా వాళ్ల ప్రోత్సాహంతోనే 40 క్యాసెట్ల భక్తి పాటలు రాశాడు.
సీతారామశాస్త్రి దగ్గర శిష్యరికం చేసి గీత రచయితగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. ఇప్పటివరకు ఈయన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, ఢీ, చిరుత, కింగ్, రెడీ, ఖలేజా, దూకుడు, మిర్చి, సౌఖ్యం, జనతా గ్యారేజ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చిత్రాల పాటలకు లిరిక్స్ అందించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో భాగం అయ్యారు.ఈయన మీడియాతో మాట్లాడుతూ.." ఎన్టీఆర్ 30వ సినిమాకు పాటలు రాస్తున్నాను. మ్యూజిక్ సిట్టింగ్స్ ఇంకా ప్రారంభం కాలేదు. ఈ సినిమాలో నేను ఎన్ని పాటలు రాస్తున్నానో ఇంకా శివ గారు నిర్ణయించలేదు.." అంటూ రామ జోగయ్య శాస్త్రి వెల్లడించారు. ఈ విషయం తెలిసి అభిమానులు కూడా ఈ సినిమా పాటల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.