టాలీవుడ్ లో ఎంతమంది హీరోయిన్లు సైతం అభిమానులను సంపాదించారు. అభిమానులు ఎక్కువగా తమ ఫ్యాన్స్ యొక్క విషయాలను తెలుసుకోవడానికి చాలా ఆతృతగా ఉంటారు. అలవారీ యొక్క పాత జ్ఞాపకాలను కూడా అప్పుడప్పుడు బయటకి వెలికి తీస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో వెంటనే చూస్తే గుర్తుపట్టడం కాస్త కష్టమని చెప్పవచ్చు. రెండు జడలతో కాటుక కళ్ళతో ఉన్న ఈమె ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్ అని తెలుస్తోంది. కాసేపు అలాగే చూస్తే వెంటనే గుర్తుపట్టవచ్చు.
ఇక ఆమె ఎవరో కాదు స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఈమె తల్లిదండ్రులు ఇద్దరు కూడా సినీ పరిశ్రమకు చెందినవారు కావడంతో చిన్న వయసు నుంచే సినిమాలు మీద మక్కువ ఉండటంతో కీర్తి సురేష్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రి ఇచ్చింది. తండ్రి కూడా డైరెక్టర్ కావడంతో చిన్న వయసప్పుడే బాలనటిగా సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించింది. మొదటి సారిగా గీతాంజలి అనే ఒక మలయాళం సినిమాతో ఈమె హీరోయిన్గా తన కెరీర్ ని మొద లు పెట్టింది.ఆ తర్వాత రింగ్ మాస్టర్ అనే చిత్రంలో కూడా నటించింది. ఇవేవీ పెద్దగా కలిసి రాలేదు.తెలుగులో సీనియర్ నటుడు నరేష్ కుమారుడితో కలిసి ఒక సినిమాలో నటించిన ఈ సినిమా ఇప్పటికీ విడుదల కాలేదు.ఆ తర్వాత హీరో రామ్ తో కలిసి నేను శైలజ అనే సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత తెలుగు,తమిళంలో పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. 2018లో నటించిన మహానటి సినిమాతో ఈమె కెరీర్ కు పెద్ద ప్లస్ అయిందని చెప్పవచ్చు. అయితే ఎందుకో కానీ ఆ సినిమా తర్వాత ఏమి కమర్షియల్ సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ లేడీ ఓరియంటెడ్ చిత్రాలను నటిస్తోంది. ప్రస్తుతం దసరా సినిమాలో, భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: