క్రియేటివ్ దర్శకుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సుకుమార్ దాదాపు 20 సంవత్సరాలు పైగా సినిమా తీస్తున్నాడు. తీసిన సినిమాలు చాల తక్కువ అయినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు జాతీయ స్థాయి దర్శకుడుగా మారిపోయాడు.


రెండు దశాబ్దాల క్రితం సుకుమార్ తో దర్శకులుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చాలామంది దర్శకులు కనుమరుగై పోయినా మారిన ట్రెండ్ కు అనుగుణంగా సినిమాలు తీస్తూ ఉండటంతో సుకుమార్ ఇప్పటికీ టాప్ దర్శకుల లిస్టులో కొనసాగుతున్నాడు అన్నకామెంట్స్ కూడ ఉన్నాయి. దర్శకుడుగా సుకుమార్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు సోషల్ మీడియా హడావిడి లేదు.


ఇప్పుడు సోషల్ మీడియా సపోర్ట్ లేకుండా ఒక రాజకీయ నాయుకుడు కానీ లేదా ఫిలిం సెలెబ్రెటీ కానీ ఒక్క అడుగు కూడ ముందుకు వేయలేని పరిస్థితి. ఎంత సమర్థవంతుడు అయినప్పటికీ అతడికి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ ను బట్టే అతడి రేంజ్ ని నిర్ణయిస్తున్నారు. ‘పుష్ప’ మూవీ ఘన విజయంలో సుకుమార్ చాల తెలివిగా మేనేజ్ చేసిన సోషల్ మీడియా వ్యూహాలు కూడ ఆ మూవీ సూపర్ సక్సస్ కు దోహద పడ్డాయి అన్న కామెంట్స్ కూడ ఉన్నాయి.


తాను తీసే సినిమాకు సంబంధించి ఒక డైలాగ్ వ్రాసినా ఒక పాట చిత్రీకరించినా అవి ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో వస్తాయని భావించే విధంగా ప్లాన్ చేసి తాను చిత్రీకరిస్తాను అని సుకుమార్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. దీనినిబట్టి సుకుమార్ ఎంత తెలివిగా సోషల్ మీడియాను తన సినిమాల విజయానికి ఉపయోగించుకుంటున్నాడో అన్నది అర్థం అవుతుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ‘పుష్ప 2’ షూటింగ్ స్పాట్ నుండి తెలివిగా తనకు తానే ఫోటోలను లీక్ చేస్తూ అవి లీక్ అయ్యాయి అని చెపుతూ ‘పుష్ప 2’ మ్యానియాను సోషల్ మీడియాను చాల తెలివిగా సుకుమార్ ఉపయోగించుకుంటున్నాడు అనిపిస్తుంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: