
ఇకపోతే ఇటీవలే కాలంలో యాంకర్ దగ్గర నుంచి జడ్జిల వరకు జబర్దస్త్ లో అన్ని మార్పులు వచ్చాయి అని చెప్పాలి. ఇక కొత్త టీంలు కూడా పుట్టుకొచ్చాయి. అయినప్పటికీ ఎంటర్టైన్మెంట్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఇకపోతే ఇటీవల కాలంలో జబర్దస్త్ కార్యక్రమం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేందుకు ఏదో ఒక కాంట్రవర్సీని సృష్టించి ఇక ప్రోమోలను సోషల్ మీడియాలో వదలడం లాంటివి చేస్తున్నారు షో నిర్వాహకులు. ఇటీవల ఇలాంటి ప్రోమో నే వదిలారు అన్నది తెలుస్తుంది. ఇటీవల విడుదలైన జబర్దస్త్ ప్రోమోలో శ్రీరామనవమి సందర్భంగా స్పెషల్ స్కిట్లు చేశారు జబర్దస్త్ కమెడియన్స్. అయితే ఇక ఈ ప్రోమో ఎండింగ్లో జబర్దస్త్ జడ్జిగా ఉన్న ఇంద్రజ కోపంతో ఊగిపోయింది. దీనికి కారణం కొత్తగా వచ్చిన యాంకర్ సౌమ్యరావు కావడం గమనార్హం.
ఇంతకీ ఏం జరిగిందంటే.. అప్పుడు వరకు అందరు కమెడియన్స్ స్కిట్లు చేసి అలరించారు. అయితే చివర్లో శ్రీరామ నవమి సందర్భంగా కమెడియన్స్ అందరూ కూడా పానకం చేసారు. దీంతో జడ్జిగా ఉన్న ఇంద్రజ ఎవరి పానకం బాగుంది అని చెప్పాల్సి వచ్చింది. దీంతో రాకెట్ రాఘవ పానకం బాగుందని ఇంద్రజ చెబుతుంది. కానీ మరొకరి పానకం బాగుంది అంటూ సౌమ్య రావు వాదనకు దిగుతుంది. అంత కావాలంటే మీరు చెక్ చేయండి అంటూ మరో జడ్జ్ కృష్ణ భగవాన్ ను అడుగుతుంది. దీంతో కోపంతో ఊగిపోయిన ఇంద్రజ అలాంటప్పుడు నన్నెందుకు అడిగావు అంటూ సీరియస్ అవుతుంది.