
మీడియా వాళ్ళు అడుగుతున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ తను కాని లేదంటే అఖిల్ కానీ కోరుకుంటే టాప్ దర్శకుల సినిమాలను సెట్ చేయగల సమర్థత తన తండ్రికి ఉంది అంటూ తాము తమ సినిమాలలో చేస్తున్న ప్రయోగాలు అన్నీ తమ ఆలోచనలు మాత్రమే అని దానికి నాగార్జున ఇమేజ్ కి ఏమాత్రం సంబంధం లేదు అంటూ క్లారిటీ ఇస్తున్నాడు. ఇదే సందర్భంలో దర్శకుడు పరుశు రామ్ తో చేయవలసిన సినిమా ఆగిపోవడం వెనుక కారణాలు వివరిస్తూ పరుశు రామ్ ను టార్గెట్ చేస్తూ చైతూ చేసిన కామెంట్స్ షాకింగ్ గా మారాయి.
దర్శకుడు పరుశు రామ్ సినిమా ఎందుకు ఆగిపోయింది అన్నవిషయం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతమంచిది అంటూ ఆసినిమా వ్యవహారం వల్ల తన విలువైన కాలం వృధా అయింది అంటూ కామెంట్ చేసాడు. వాస్తవానికి పరుశు రామ్ చైతన్యతో సినిమా చేయడానికి అంతా రెడీ పెట్టుకుని ఆతరువాత మహేష్ నుండి పిలుపు రావడంతో ‘సర్కారు వారి పాట’ మూవీ ప్రాజెక్ట్ వైపు వెళ్ళిపోవడం చైతన్యకు తీవ్ర అసహనాన్ని కలిగించినట్లుగా అతడి మాటలను బట్టి అర్థం అవుతుంది.
పరుశు రామ్ చైతన్యను వదులుకుని మహేష్ వైపు వెళ్ళినప్పటికీ ఆసినిమా ఊహించిన స్థాయిలో విజయం సాధించక పోవడంతో టాప్ డైరెక్టర్ గా మారాలి అన్న పరుశు రామ్ కల నెరవేరలేదు. ఆతరువాత గోపీచంద్ తో ‘పక్కా కమర్షియల్’ కూడ పరుశు రామ్ కు అదృష్టాన్ని తెచ్చిపెట్టలేదు. ఇలాంటి పరిస్థితులలో చైతన్య డైరెక్ట్ గా పరుశు రామ్ ను టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ ఆదర్శకుడి ఇమేజ్ ని కొంతవరకు దెబ్బ తీస్తాయి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..