
దీనితో ఈనెల విడుదల కాబోతున్న ‘ఆదిపురుష్’ మూవీకి అన్ని పరిస్థితులు కలిసి వస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. ఈ మూవీ తరువాత ఆగష్టులో చిరంజీవి ‘భోళాశంకర్’ మూవీ ఉన్నప్పటికీ దసరా రేస్ మాత్రమే పెద్దదిగా కనిపిస్తున్న నేపధ్యంలో ఈ రేస్ ను టార్గెట్ చేస్తూ బాలకృష్ణ అనీల్ రావిపూడి ల మూవీతో పాటు రవితేజా ‘టైగర్ నాగేశ్వరావు’ రామ్ బోయపాటిల మూవీ కూడ దసరా రేస్ కు రాబోతోంది.
అయితే ఎవరు ఊహించని విధంగా ఈ దసరా కు మళ్ళీ డబ్బింగ్ సినిమా తలపోటు ఎదురౌతోంది. విజయ్ నటించిన ‘లియో’ మూవీ కూడ దసరా రేస్ కు సిద్ధపడుతున్నట్లు స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. ఈ సినిమా డబ్భింగ్ రైట్స్ ను ఒక ప్రముఖ టాలీవుడ్ నిర్మాత కొనడంతో దసరా సీజన్ కు సినిమాలకు మళ్ళీ ధియేటర్ల సమస్య ఏర్పడుతుంది.
ఇప్పటి నుంచే ఆ ప్రముఖ నిర్మాత తన సినిమాకు ధియేటర్ల సమస్య లేకుండా ముందు నుంచే అడ్వాన్స్ లు ఇచ్చి ధియేటర్లు బ్లాక్ చేసే ఆలోచనలలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సంవత్సరం సంక్రాంతికి కూడ ఇదే పరిస్థితి ఎదురైంది. బాలకృష్ణ చిరంజీవిల సినిమాలాతో పాటు విజయ్ నటించిన ‘వారసుడు’ సినిమా పోటీగా విడుదల అవ్వడంతో ధియేటర్ల కోసం అనేక రాజకీయాలు జరిగాయి. ఇప్పుడు మళ్ళీ అదే సీన్ దసరా కు రిపీట్ అవుతుందా అంటూ ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి..