నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ సీనియర్ హీరోలలో టాప్ హీరోగా పేరు సంపాదించారు.. ఒకవైపు రాజకీయ నాయకుడిగా మరొకవైపు నటుడుగా... మరొకవైపు బసవతారకం హాస్పిటల్ ని నడుపుతూ ఎన్నో ప్రశంసలు అందుకున్నారు బాలయ్య. అయితే ఈ రోజున బాలయ్య పుట్టినరోజు సందర్భంగా బాలయ్య కెరియర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలలో నటించారు అందులో టాప్ చిత్రాలను ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.


బాలయ్య కెరియర్లు మొదటి స్థానంలో ఉన్న మంగమ్మగారి మనవడు చిత్రం కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కించారు ఈ సినిమా 1984లో విడుదలై బాలయ్య కెరియర్ కు టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఈ చిత్రంతో బాలకృష్ణ మొదటిసారి గోల్డెన్ జూబ్లీ హిట్ అందుకున్నాడు.


డి రామానాయుడు సురేష్ ప్రొడక్షన్ నిర్మాణంలో మురళీమోహన్రావు దర్శకత్వంలో వచ్చిన కథానాయకుడు సినిమా బాక్సాఫీస్ వద్ద హీట్ గా నిలిచింది.

ఏ కోదండరామిరెడ్డి బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన మొదటి చిత్రం అనసూయమ్మ గారి అల్లుడు.. ఈ చిత్రాన్ని నందమూరి హరికృష్ణ రామకృష్ణ సినీ స్టూడియో బ్యానర్లు నిర్మించారు.


జంధ్యాల దర్శకత్వంలో బాలయ్య నటించిన బాబాయి అబ్బాయి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమాతో బాలయ్యలోని కామెడీ యాంగిల్ ని కూడా పరిచయం చేశారు.


బాలయ్య కోదండరామిరెడ్డి కాంబినేషన్లో వచ్చిన రెండో చిత్రం ముద్దుల కృష్ణయ్య ఈ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడమే కాకుండా కొన్ని ఏరియాలలో ఒక సంవత్సరం పాటు ఆడినట్టుగా తెలుస్తోంది.

బాలకృష్ణ కోడి రామకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ఐదవ చిత్రం ముద్దుల మామయ్య ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకోవడమే కాకుండా అప్పటివరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులను సైతం తిరగరాసింది.

బాలయ్య కెరియర్నే మార్చేసిన చిత్రం ఆదిత్య 369 ఈ చిత్రం శ్రీకృష్ణదేవరాయలుగా యువకుడిగా రెండు విభిన్నమైన పాత్రలలో నటించారు. టైం మిషన్ కాన్సెప్ట్ తో వచ్చిన మొదటి సైన్స్ ఫిక్షన్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాతో బాలయ్య ఉత్తమ చిత్రంగా అవార్డును అందుకున్నారు.


ఇదే కాకుండా రౌడీ ఇన్స్పెక్టర్ ,బంగారు బుల్లోడు, భైరవద్వీపం, బొబ్బిలి సింహం, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహ ,లెజెండ్, అఖండ తదితర చిత్రాలు ఉన్నాయని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: