‘ఆదిపురుష్’ రిలీజ్ కు కౌంట్ డౌన్ ప్రారంభం కావడంతో ఈమూవీకి ఏర్పడిన మ్యానియాతో అడ్వాన్స్ బుకింగ్ టిక్కెట్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. బుక్ మై షో యాప్ లో ఈమూవీ టిక్కెట్లకు ఏర్పడిన క్రేజ్ ను చూసినవారికి ఈమూవీ ఓపెనింగ్ కలక్షన్స్ తో పాటు మొదటి మూడు రోజులు ఈమూవీ కలక్షన్స్  రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అన్న స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి.


తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈమూవీ టిక్కెట్లకు డిమాండ్ ఏర్పడింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవిధంగా ఇప్పుడు ఈసినిమా టిక్కెట్ల విషయంలో కొనసాగుతున్న డిమాండ్ ఈమూవీ బయ్యర్లకు జోష్ ను ఇచ్చే పరిణామంగా పేర్కొనవచ్చు. ఇది ఇలా ఉంటే ఈసినిమా ఓటీటీ రిలీజ్ 8 వారాల తరువాత ఉంటుంది అన్న గ్యారెంటీ పై ఈమూవీ బిజినెస్ జరిగింది అంటున్నారు.


ఈమధ్య కాలంలో టాప్ హీరోల సినిమాలు కేవలం నాలుగు వారాలాకే ఓటీటీ లోకి వచ్చేస్తున్న పరిస్థితులలో ఈమూవీ బయ్యర్లలో ధైర్యం కలగడానికి ‘ఆదిపురుష్’ మూవీ నిర్మాతలు ఈ కొత్త విధానానికి తెర తీసినట్లు తెలుస్తోంది.


ఇది ఇలా ఉంటే వాట్సాప్ లో ‘ఆదిపురుష్’ చూడటానికి గైడ్ లైన్స్ అంటూ హడావిడి చేస్తున్న కొన్ని నియమాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈసినిమాకు వచ్చే ప్రతి వ్యక్తి శుచిగా శుభ్రతగా చాలా పరమ పవిత్రంగా భక్తిభావంతో సినిమాకు రావాలని సూచనలు చేస్తున్నారు. ఈ


సూచనలు ఎవరు ఎందుకు సూచిస్తున్నారు అన్న విషయమై క్లారిటీ లేకపోయినా ఇది నిజంగా ఈసినిమా పై అభిమానంతో కొందరు చేస్తున్న పని అనుకోవాలా లేదంటే ఈమూవీ పై కొందరు చేస్తున్న నెగిటివ్ ట్రోలింగ్ అనుకోవాలా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి ప్రతి షోకు ఆంజనీయ స్వామి వస్తాడు అంటూ జరుగుతున్న పబ్లిసిటీ తో పాటు ఇప్పుడు శుచి శుభ్రత కూడ తోడైతే ఈమూవీ ప్రదర్శించే ధియేటర్లు దేవుడు ఆలయాలుగా మారిపోయే ఆస్కారం ఉంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: