ఈ క్రమంలోనే నేషనల్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ పై ప్రశంసల వర్షం కురుస్తుంది అని చెప్పాలి. అయితే నేషనల్ అవార్డు రేసులో అటు అల్లు అర్జున్ తో పాటు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కూడా ఉన్నారు. వీరు నటించిన త్రిబుల్ ఆర్ సినిమాకు గాను జాతీయ అవార్డుకు నామినేట్ అయ్యారు అని చెప్పాలి. అయితే ఈ ముగ్గురు హీరోలలో ఎవరికి అవార్డు వరిస్తుంది అనేది ఆసక్తికరంగా ఉంది. ఇంకా చివరికి ఉత్తమ నటుడు కేటగిరిలో అల్లు అర్జున్ కు, బెస్ట్ మ్యూజిక్ కేటగిరీలో రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ కు అవార్డులు దక్కాయ్. అయితే జాతీయ అవార్డు రేసులో తన స్నేహితులు అయిన చరణ్, తారక్ ఉండటంవల్ల ఒత్తిడికి గురయ్యారా అనే ప్రశ్నకు అల్లు అర్జున్ ఆసక్తికర సమాధానం చెప్పాడు.
ఇటీవల నేషనల్ అవార్డు దక్కిన సందర్భంగా అల్లు అర్జున్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే కొన్ని అంశాలపై మాట్లాడారు. ఈ క్రమంలోనే చరణ్, తారక్ నేషనల్ అవార్డు కోసం పోటీ ఇవ్వడంపై ప్రశ్న ఎదురువ్వగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వాళ్లు పోటీలో ఉండడం వల్ల నేను ఒత్తిడిగా ఏం ఫీల్ అవ్వలేదు. అయితే ఉత్తమ నటుడు కేటగిరీలో నేషనల్ వైడ్ గా మొత్తం 20 మందికి పైగా నామినేషన్స్ వచ్చాయి. ఇందులో సౌత్ స్టార్స్ తో పాటు నార్త్ స్టార్స్ కూడా ఉన్నారు. దక్షిణాది నుంచి కాకుండా హిందీ నుంచి కూడా నలుగురు స్టార్స్ గట్టిగా పోటీ ఇచ్చారు. నేను మాత్రం లోకల్ కంటే ఓవరాల్ నేషనల్ వైడ్ పోటీ గురించి ఆలోచించాను అంటూ బన్నీ బదులిచ్చాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి