ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు.. తన నటనతో, మేనరిజంతో పాన్ ఇండియా వైడ్ గా ప్రేక్షకులను దక్కించుకున్న ఈయన ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 1 కి సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇకపోతే పుష్ప 1 సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా.. స్టార్ హీరోయిన్ సమంత ఐటెం సాంగ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాదు ఇందులో సునీల్, రావు రమేష్ , ధనుంజయ, యాంకర్ అనసూయ సైతం కీలక పాత్రలు పోషించారు.

ఫహద్ ఫాజిల్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  ఇక వీళ్లంతా కూడా పుష్ప 2 లో కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాదులో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ పుష్ప 1 సినిమాకి గాను జాతీయ అవార్డు అందుకున్నారు. జాతీయ అవార్డు లభించింది అని తెలిసిన రోజే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ సినీ ప్రేక్షకులు అలాగే పక్క సినిమా ఇండస్ట్రీలో నుండి కూడా ఆయనకు ప్రశంసలు లభించాయి.

ఇక తాజాగా అల్లు అర్జున్ నేషనల్ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. ఈ అవార్డును అందుకున్న తర్వాత ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తన భార్య స్నేహ తల్లిదండ్రుల ఫోటోలను షేర్ చేస్తూ మరిచిపోలేని రోజు నా చుట్టూత మర్చిపోలేని నా వాళ్ళతో అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు. మరొకవైపు పుష్ప టీమ్ సభ్యులతో ఫోటోలు దిగి ఆ అపురూపమైన ఫోటోలను బన్నీ పంచుకోవడం జరిగింది. మొత్తానికైతే నేషనల్ అవార్డు అందుకొని మరొక రికార్డు సృష్టించారు అల్లు అర్జున్.

మరింత సమాచారం తెలుసుకోండి: