ఇప్పటివరకు పరాజయం అన్నపదం చూడని అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఏదోఒక మ్యాజిక్ ఉంటుంది అని ఆశించిన సగటు ప్రేక్షకుడుకి ఈమూవీ కోరుకున్న కిక్ ఇవ్వలేకపోయింది అన్న కామెంట్స్ కూడ వస్తున్నాయి. అనిల్ రావిపూడి బాలయ్యను నెవర్ బిఫోర్ స్టయిల్ లో చూపించబోతున్నట్లు ఈసినిమా టీజర్ ట్రైలర్ చూసిన వారు భావించారు.
అయితే వాస్తవంగా జరిగింది వేరు అన్నమాటలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈమూవీ ఓపెనింగ్ కలెక్షన్స్ అదిరిపోతాయి అని భావించారు బాలకృష్ణ ‘అఖండ’ ‘వీరసింహారెడ్డి’ ల కన్నా డల్ గా ఈమూవీ ఓపెనింగ్ కలెక్షన్స్ ఉండటం చాలమందిని ఆశ్చర్య పరిచింది. వాస్తవానికి బాలయ్యకు మాస్ ఫాలోయింగ్ ఎక్కువ ఆమాస్ కూడా ఈ మూవీ పై పూర్తి గా ఆశక్తి చూపించక పోవడానికి ఒక కారణాం ఉంది అని అంటున్నారు.
నందమూరి అభిమానులలో ఎప్పుడూ ఉండే యూనిటీ ఇప్పుడు కనిపించక పోవడం ఒక ప్రధాన కారణంగా భావిస్తున్నారు. బాలయ్యకు తారక్ కు మధ్య విభేదాలు చాలా ఏళ్ల నుంచి ఉన్నప్పటికీ వీళ్లలో ఎవరి సినిమా రిలీజైనా రెండు వర్గాలూ ఒక్కటై ఆసినిమాకు భారీ ఓపెనింగ్ కలెక్షన్స్ వచ్చేలా కృషి చేసేపారు. ఇటీవలి రాజకీయ పరిణామాల నేపధ్యంలో ఒక మీడియా సమేశంలో ఒక మీడియా ప్రతినిధి తారక్ గురించి అడిగితే ‘డోంట్ కేర్’ అంటూ బాలయ్య పేల్చిన సెటైర్ కారణంగా తారక్ అభిమానులు అంతా ఒక మాట అనుకుని ‘భగవంత్ కేసరి’ ని పక్కకు పెట్టారా అన్న సందేహాలు కొందరు వ్యక్త పరుస్తున్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి