మెగా డాటర్ నిహారిక  ఈ మధ్యకాలం లో సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. యాక్టర్ గా, ప్రొడ్యూసర్గా బిజీ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్లు తెలుస్తోంది.పెళ్లి తర్వాత సినిమా లకు దూరంగా ఉంటూ వచ్చిన నిహారిక..ఇటీవలే వెబ్‌ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇటీవల తన సోదరుడు వరుణ్ తేజ్ పెళ్లి లో ఆద్యంతం సందడి చేస్తూ, ఫోటోషూట్ల లో ఫ్యాన్స్ ను మైమరిపించింది.లేటెస్ట్గా నిహారిక బ్లూ డిజైనర్ ఫ్రాక్ లో తళతళా మెరిసిపోతున్న ఫోటోలను షేర్ చేసింది. స్టైలిష్ లుక్‌ ఫోటోను షేర్‌ చేసి మెగా ఫ్యాన్స్ తో పాటు నెటిజన్స్ దృష్టిని ఆకర్షించింది. ఈ బ్లూ డ్రెస్ పై రకరకాల కామెంట్లు ఫ్యాన్స్ నుంచి వినిపిస్తున్నాయి. ఇందు లో ఒక అభిమాని..'వావ్ మీరు స్వర్గం నుండి వచ్చిన మాగ్నోలియా పువ్వులా ఉన్నారు..బృహస్పతి యురేనస్ మెర్క్యురీ నెప్ట్యూన్..ప్లూటో తాజే కేర్ హ్యాపీ వీకెండ్` అని ఒక అభిమాని కవిత అల్లాడు.దీంతో అమాంతం ఫొటోస్కు భారీ హైప్ వచ్చేస్తోంది. ఇక ఫ్యాన్స్ తమదైన స్టైల్ లో అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరో అభిమాని అయిన ఉపేంద్ర యాదవ్ పిళ్లై అనే యువకుడు సోషల్ మీడియా ల్లో ఒక అడుగు ముందు కేసి నిహారిక ను ఆరాధిస్తున్న కవితలు షేర్ చేసాడు. ఏది ఏమైనా నిహారికను ఆరాధించేవారు అంతకంతకు పెరుగుతున్నారు.ప్రస్తుతం నిహారిక ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసే ప్రతి పోస్ట్ వెనుక..ఏదో కారణం అయితే బలంగా ఉందనే మాట వినిపిస్తోంది. ఇప్పటికే హీరోయిన్ గా నాలుగు, ఐదు సినిమాలు చేసిన పెద్దగా ఆశించిన సక్సెస్ రాలేదు. దీంతో మళ్ళీ హీరోయిన్ గా ఛాన్సెస్ కోసం తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. మరి ఏదైనా బడా ప్రాజెక్ట్స్ నుంచి అవకాశం వస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అవుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: