కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన మూడవ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆత్రుతగా ఎదురుచూసేలా చేస్తోంది. ఆ సినిమాని సలార్.. మొదటి సినిమా ఉగ్రంతో కన్నడలో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత కేజిఎఫ్ చిత్రాలను తెరకెక్కించి మరింత విజయాలను అందుకున్నారు. ఇప్పుడు ప్రభాస్ తో కలిసి సలార్ సినిమా అని చేయబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ చేయకపోయినా పలు రకాల ఇంటర్వ్యూలు ఇస్తూ చిత్ర బృందం శరవేగంగా పాల్గొంటుంది. నిన్నటి రోజున సలార్ సినిమా ట్రైలర్ ని విడుదల చేయగా ఈ సినిమాకి మరింత ఊపు తెచ్చేలా చేసింది.


తాజాగా ప్రశాంత్ నీల్సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ప్రశాంత్ నీల్ చిత్రాలన్నీ ఎందుకు డార్క్ ఫ్రేమ్ లోనే ఉంటాయి అని అడగగా దీనిపైన సోషల్ మీడియాలో కూడా ట్రోల్స్ వినిపిస్తున్నాయి అని అడగడం జరిగింది.. అంతేకాకుండా సలార్ సినిమాలో కూడా డార్క్ గానే చూపించబోతున్నారు ఎందుకు అని తాజా ఇంటర్వ్యూలో అడగగా అందుకు ప్రశాంత్  నీల్ మాట్లాడుతూ.. తనకు OCD అనే సమస్య ఉందని.. నాకు ఏదైనా ఎక్కువగా కలర్స్ ఉంటే నచ్చదు అని తెలియజేశారు.


అందుకే తన సినిమాలు ఎప్పుడు డార్క్ మోడ్ లోనే ఉంటాయని తెలియజేశారు. తన పర్సనల్ థాట్స్ అన్ని కూడా స్క్రీన్ మీద రిప్లేట్ అవుతాయి అంతేకానీ సినిమాలకు ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు అంటూ క్లారిటీ ఇవ్వడం జరిగింది.. ఇలాంటి సమస్య ఉన్నవారు అందరూ కూడా కేవలం ప్రతిదీ చాలా క్లీన్ గా ఉండాలని చూస్తారు.. చేసింది రిపీట్ చేసే సమస్యలే కాదు డిఫరెంట్ ఆలోచనలు కూడా ఉంటాయని కలర్స్ కి సంబంధించిన ఇలాంటి సమస్యలు కూడా ఉంటాయని తెలియజేయడం జరిగింది ప్రశాంత్ నీల్.. మరొకసారి కే జి ఎఫ్ సలార్ సినిమాకు ఎలాంటి కలెక్షన్ లేదని కూడా తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: