ముఖ్యంగా పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ల గురించి మాట్లాడి మరింత క్రేజ్ అందుకుంది. ఏదైనా గ్యాప్ దొరికితే చాలు సోషల్ మీడియాలో త్రివిక్రమ్ పైన పూనమ్ కౌర్ ఎన్నో సందర్భాలలో ఫైర్ కావడం మనం చూస్తూనే ఉన్నాము.. అయితే ఈ సంక్రాంతికి మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న గుంటూరు కారం సినిమా విడుదల సమయం దగ్గర పడుతూ ఉండడంతో ఈ సినిమా పైన కొన్ని కాపీ ఆరోపణలు వినిపించాయి.. ఈ విషయంపై కూడా సంచలన పోస్ట్ చేసింది పూనమ్ కౌర్.. ఇప్పుడు తాజాగా పూనమ్ కౌర్ త్రివిక్రమ్ మధ్య విభేదాలు రావడానికి ముఖ్య కారణం ఏంటి అనే విషయం పైన పలు రకాల వార్తలు వైరల్ గా మారుతున్నాయి.
గతంలో పవన్ కళ్యాణ్ సినిమాలలో త్రివిక్రమ్ ఆమెకు అవకాశాలు ఇప్పిస్తానంటూ చెప్పి మోసం చేయడంతో పాటు తనని ఎన్నో రకాలుగా ఉపయోగించుకున్నారని వార్తలు ఇప్పటికీ ఇండస్ట్రీలో వినిపిస్తూనే ఉంటాయి.. అప్పుడప్పుడు పూనమ్ కౌర్ చేసే ట్విట్లు పైన కూడా ఈ వార్తలు నిజమే అనేంతలా కనిపిస్తూ ఉంటాయి.. గతంలో కూడా త్రివిక్రం ని బ్యాన్ చేయాలి అంటూ కూడా పలు రకాల ట్విట్లను షేర్ చేయడం జరిగింది. గతంలో కూడా ఒక వ్యక్తి తన జీవితాన్ని నాశనం చేశారంటూ తాను ఆత్మహత్య చేసుకుంటానన్నా కూడా పట్టించుకోలేదని గతంలో ఒక ట్విట్ చేస్తూ గురూజీ అనే హ్యష్ ట్యాగ్ ను జోడించింది. దాదాపుగా వీరి మధ్య విభేదాలు మొదలై ఆరు సంవత్సరాలు పైనే కావస్తున్నట్లు సమాచారం.
.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి