తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో సుహాస్ ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమా లలో నటించి అద్భుతమైన గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకున్నాడు. కొంతకాలం క్రితం ఈయన రైటర్ పద్మభూషణ్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఇకపోతే ఈ నటుడు తాజాగా అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ అనే సినిమాలో హీరో గా నటించాడు.

సినిమా కొన్ని రోజుల క్రితమే మంచి అంచనాల నడమ థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకుంది. ఇకపోతే ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించిన 4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 4 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ పు దక్కాయి అనే విషయాలను తెలుసుకుందాం. 4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 1.15 కోట్ల కలెక్షన్ లు దక్కగా ... ఆంధ్ర ప్రదేశ్ లో 1.65 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకి 4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2.85 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

ఇకపోతే ఈ మూవీ కి 4 రోజుల్లో కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్ సీస్ లో కలుపుకుని 85 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా 4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 3.70 కోట్ల షేర్ ... 7.35 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే దాదాపు మూడు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు 70 లక్షల లాభాలను అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర ఫార్ములాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: