పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఎట్టకేలకు బిగ్ సర్ ప్రైజ్ రానే వచ్చేసింది. ఇన్నాళ్లుగా ఎంతగానో వెయిట్ చేస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్ ఎట్టకేలకు రివీల్ చేశారు మేకర్స్. గబ్బర్ సింగ్ సినిమా తర్వాత డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో ఎన్నో భారీ అంచనాలు ఉన్నాయి.ఈ మూవీకి టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. యంగ్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా కనిపించనుంది. ఇందులో మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈసారి మరింత సూపర్ స్టైలీష్ గా.. పవర్ ఫుల్ గా ఆయన రోల్ డిజైన్ చేశారని తెలుస్తోంది. ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపొద్ది అంటూ ఫస్ట్ గ్లింప్స్ లో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్స్ ఈ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేసింది. ఈ మూవీ గురించి పూర్తి వివరాలను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.ఇది నీ రేంజ్ అంటూ టీ గ్లాసుని రౌడీ కిందపడేయడంతో వీడియో అనేది స్టార్ట్ అవుతుంది. 


గాజు పగిలేకొద్ది పదునెక్కుద్ది… ఖచ్చితంగా గుర్తుపెట్టుకో.. గ్లాస్ అంటే సైజు కాదు.. సైన్యం.. కనిపించని సైన్యం అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్స్ అభిమానులను ఎంతో ఆకట్టుకునేలా ఉన్నాయి. దీంతో ఈ సినిమాపై మరింత హైప్ ఏర్పడింది.ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ రాజకీయాలతో బిజీగా ఉండడం వల్ల చాలా కాలంగా ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇంకా దీంతో అటు రవితేజతో మిస్టర్ బచ్చన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు డైరెక్టర్ హరీష్. దీంతో పవన్ కళ్యాణ్ మూవీపై అనుమానాలు తలెత్తాయి. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ కు పవన్ కళ్యాణ్ డబ్బింగ్ చెబుతున్న ఫోటోస్ షేర్ చేస్తూ అప్డేట్ రాబోతుందని పోస్ట్ చేశారు మేకర్స్. దీంతో ఎన్నికల సమయంలో ఉన్నట్లుండి ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్ రావడంతో ఖచ్చితంగా పొలిటికల్ టచ్ ఉంటుందని అంతా కూడా భావించారు. ఇక ఇప్పుడు రిలీజ్ అయిన గ్లింప్స్ లో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్స్ గ్లాసు, గాజు అంటూ జనసైనికులను ఎంతగానో ఆకట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా దేవి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: