గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.'చరణ్, నేనూ చెన్నైలో కలిసే పెరిగాం. స్నేహానికి విలువిచ్చే మంచి వ్యక్తి. ఇన్నేళ్లయినా పాత స్నేహితులను మర్చిపోలేదు. దుబాయ్ లో ఒక పాపకి ఆపద వస్తే ఆదుకున్నాను. ఇంకా 5లక్షలు కావాలి. ఎవర్ని అడగాలో తెలీక అర్ధరాత్రి రామ్ చరణ్ కు ఫోన్ చేశా. నిముషంలో పంపించాడు. అదే చరణ్. కెరీర్లో చరణ్ మరింతగా రాణించాలని.. ప్రపంచంలోనే ప్రముఖ హీరోగా ఎదగాలని కోరుకుంటున్నా'.

'మీ తండ్రుల మాదిరిగా కాకుండా మీరెలా స్నేహంగా ఉంటున్నారని కొందరు అడుగుతారు. భార్యభర్తల గొడవల మాదిరే చిరంజీవి -మోహన్ బాబు గారివి. ఎవరూ వెళ్లకూడదు. 45ఏళ్ల స్నేహం వారిది. టామ్ అండ్ జెర్రీ మనస్తత్వాలు. అలుగుతారు.. కలుసుకుంటారు. మొత్తంగా..అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఇదే సందర్భంలో పవన్ కల్యాణ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. మనోజ్ వ్యాఖ్యలపై అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.మీ నాన్నలిద్దరూ కొట్టుకుంటూ ఉంటారు. మీరు మాత్రం ఎలా కలిసుంటారని నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు. భార్యాభర్తల మధ్యలోకి మనం ఎప్పుడూ వెళ్లకూడదు. వాళ్లిద్దరు కూడా అంతే.. కొట్టుకుంటారు, కలిసిపోతారు. క్యూట్‌ టామ్‌ అండ్‌ జెర్రీలాగా! పొరపాటున కూడా వాళ్ల మధ్య మనం దూరకూడదు' అని మనోజ్‌ చెప్పుకొచ్చాడు.రామ్‌ చరణ్‌ తన ప్రాణ స్నేహితుడని పేర్కొన్నారు. బుధవారం చరణ్‌ పుట్టిన రోజును పురస్కరించుకుని హైదరాబాద్‌లో వేడుకలు  నిర్వహించారు. పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొని సందడి చేశారు. ఈ ఈవెంట్‌కు మనోజ్‌తోపాటు హీరోలు నిఖిల్‌, కిరణ్‌ అబ్బవరం, దర్శకులు బుచ్చిబాబు, బాబీ తదితరులు అతిథులుగా హాజరయ్యారు.

మనోజ్‌ మాట్లాడుతూ..''చరణ్‌ ఎంత గొప్ప నటుడో అంత గొప్ప మనిషి. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చలించిపోయి వెంటనే సాయం చేస్తాడు. ఇలాంటి వారు అరుదు. ఓ తెలుగు కుటుంబం దుబాయ్‌లో పలు సమస్యలు ఎదుర్కొంటుందని నాకు తెలిసింది. అప్పుడు నేను యూఎస్‌లో ఉన్నా. ఆ సమయంలో నా ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో రామ్‌ చరణ్‌కు ఫోన్‌ చేసి విషయం చెప్పా. 'నా వంతు సాయం చేశా ఇంకా రూ. ఐదు లక్షలు తక్కువయ్యాయి' అని అనగానే బ్యాంకు ఖాతా వివరాలు పంపించు అన్నాడు. నేను డిటైల్స్‌ సెండ్‌ చేసిన తక్షణమే డబ్బు పంపాడు. ఆ ఫ్యామిలీ ఆశీస్సులు చరణ్‌కు ఎప్పుడూ ఉంటాయి. తను స్నేహానికీ విలువనిస్తాడు. బాల్య మిత్రులతో ఇప్పటికీ కాంటాక్ట్‌లో ఉంటాడు'' అని పేర్కొన్నారు.

''మీ నాన్న, రామ్‌ చరణ్‌ నాన్న గొడవ పడుతుంటారు, కలిసిపోతుంటారు. మీరెలా (చరణ్‌, మనోజ్‌) ఇంతకాలంగా ఒకేలా ఉండగలిగారు?' అని ఒకరు నన్ను అడిగారు. భార్యాభర్తల విషయాల్లో కలగజేసుకున్న వ్యక్తిని ఏమంటారో తెలుసా? అని నేను ఆయన్ను ప్రశ్నించా. వాళ్లిద్దరు టామ్‌ అండ్‌ జెర్రీ లాంటి వారు. దాదాపు 45 ఏళ్ల బంధం వారిది. మాలాగే ఆ ఇద్దరు ఎల్లకాలం కలిసి ఉండాలని కోరుకుంటున్నా'' అని అన్నారు. 'పెదరాయుడు' సినిమాలోని ఫేమస్‌ డైలాగ్‌ను రీక్రియేట్‌ చేసి, అభిమానుల్లో జోష్‌ నింపారు. 'ఎ రిలేషన్‌ బెట్వీన్‌ మెగా ఫ్యామిలీ అండ్‌ మంచు ఫ్యామిలీ షుడ్‌బీ లైక్‌ ఎ ఫిష్‌ అండ్‌ వాటర్‌. బట్‌ షుడ్‌నాట్‌ బీ లైక్‌ ఎ ఫిష్‌ అండ్‌ ఫిషర్‌మ్యాన్‌' అనే సంభాషణకు ఫ్యాన్స్‌ కేరింతలతో ప్రాంగణం హోరెత్తింది.

మరింత సమాచారం తెలుసుకోండి: