2022లో  బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న అతికొద్ది తెలుగు చిత్రాల్లో “డీజే టిల్లు” ఒకటి. చిన్న హీరో సిద్ధూ జొన్నలగడ్డ  టైటిల్ పాత్ర పోషించడమే కాక రచయితగా కూడా వ్యవహరించిన ఈ సినిమా సీక్వెల్ నేడు (మార్చి 29) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.బ్లాక్ బస్టర్ హిట్ సినిమా సీక్వెల్ కావడంతోనే విశేషమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ “టిల్లు స్క్వేర్”  అనుపమ పరమేశ్వరన్ హాట్ నెస్ వల్ల  యూత్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. మరి ఈ గ్లామరస్ సీక్వెల్ ఏస్థాయిలో అలరిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.అంచనాలకు తగ్గట్లే టిల్లు పాత్రకు సిద్ధు బాగా సింక్ అయ్యాడు. అతడి డైలాగ్స్ ఇంకా బాడీ లాంగ్వేజ్ హిలేరియస్ గా వర్కవుటయ్యాయి. ఆ పాత్రలో సిద్ధు  లీనమైపోయాడు. ఇక టీజర్, ట్రైలర్లో కేవలం గ్లామర్ తో ఆకట్టుకున్న అనుపమ పరమేశ్వరన్..సినిమాలో మాత్రం నటనతో కూడా అలరించింది. ముఖ్యంగా ఆమె పాత్ర చుట్టూ అల్లిన ట్విస్టులు, ఆ ట్విస్టులను అనుపమ నటనతో పండించిన తీరు చూడటానికి చాలా బాగుంది. హాట్ నెస్ పరంగా ఇంకా నటిగా ఆమెకు బాగా ప్లస్ అవుతుంది ఈ సినిమా.


మురళీశర్మ, మురళీధర్ గౌడ్, ప్రిన్స్ ల క్యారెక్టర్స్ కామెడీ కూడా బాగా నవ్వు తెప్పిస్తుంది.కథ-కథనం కంటే కూడా కేవలం ట్విస్టుల మీద ఎక్కువగా శ్రద్ధ చూపించి తెరకెక్కించిన చిత్రమిది. డీజే టిల్లు సెకండాఫ్ కామెడీ హిలేరియస్ గా ఉంటుంది. అయితే మధ్యలో సినిమా స్లో అయ్యింది. అందువల్ల ఫస్ట్ పార్ట్ ఇచ్చిన కిక్ సెకండ్ పార్ట్ అంతగా ఇవ్వలేకపోయిందనే చెప్పాలి.రచయితగా హీరో సిద్ధు కొంత తడబడ్డాడు. దర్శకుడిగా మల్లిక్ రామ్  తన ప్రభవాన్ని అంతగా చూపలేకపోయాడు. ఇక సంగీత దర్శకులు ముగ్గురూ బాగానే న్యాయం చేసారు. ముఖ్యంగా నేపథ్య సంగీతం అయితే బాగా వర్కవుటయ్యింది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, సౌండ్ మిక్సింగ్ అన్నీ వర్క్ ఔట్ అయ్యాయి.ఈ సినిమాలో చిన్నపాటి లోపాలున్నాయి, అయితే అవి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.క్యామియోలు, అనుపమ గ్లామర్ అన్నీ "టిల్లు స్క్వేర్"ను హిలేరియస్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దాయి.సమ్మర్ లో టైమ్ పాస్ కోసం హ్యాపీగా ఈ మూవీని చూడొచ్చు.ఈ మూవీకి 3/5 రేటింగ్ ఇవ్వొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: