కాజల్ అగర్వాల్ లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోయిన్గా పరిచయమయ్యారు. ఈ సినిమా తర్వాత చందమామ మగధీర వంటి వరుస బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి కాజల్ తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా స్టార్ హీరోలు సరసన నటించే అవకాశాలను అందుకున్నారు.ఈ విధంగా ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగినటువంటి ఈమె ఇప్పటికీ కూడా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో అవకాశాలను అందుకుంటు ఉన్నారు.ఇలా తన కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే కాజల్ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇలా పెళ్లి తర్వాత కాజల్ వెంటనే తల్లి కావడంతో కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి విరామం ప్రకటించారు.

ఇలా సినిమా ఇండస్ట్రీకి విరామం ఇచ్చినటువంటి కాజల్ బాబుకు జన్మనిచ్చిన తర్వాత తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఇలా సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా కాజల్ వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు. ఇటీవల బాలయ్య హీరోగా నటించిన భగవంత్ కేసరి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి ఈమె కొత్త సినిమాలకు కమిట్ అవ్వాలి అంటే భారీ స్థాయిలో కండిషన్లు పెడుతున్నారు.

పెళ్లి తర్వాత ఈమె తన సినిమాల విషయంలో అభిప్రాయాలను పూర్తిగా మార్చుకున్నారని తెలుస్తుంది. తన పాత్రలో ఏ విధమైనటువంటి రొమాంటిక్, బోల్డ్ సీన్స్ ఉండకూడదని దర్శక నిర్మాతలకు కండిషన్లు పెడుతున్నారు. ఇక తాను తన పరిధి దాటి అసలు నటించనని ముఖ్యంగా లిప్ లాక్, బెడ్ రూమ్ వంటి సన్నివేశాలలో తాను అసలు నటించనని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు తనుకు రెమ్యూనరేషన్ తక్కువ ఇచ్చిన పర్వాలేదు ఇలాంటి పాత్రలకు తాను ఓకే చేయనని అలాంటి పాత్రలలో తాను నటించాలని ఈమె చెప్పడంతో దర్శక నిర్మాతలు షాక్ అవుతూ తలలు పట్టుకున్నారు.  ఒకప్పుడు పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ సినిమాలలో నటించినటువంటి కాజల్ ప్రస్తుతం రెమ్యూనరేషన్ తక్కువ అయిన అలాంటి వాటిలో నటించనని చెప్పడంతో ఇకపై ఈమె నుంచి ఇలాంటి సినిమాలు రావని తెలిసి అభిమానులు కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈమె సత్యభామ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. లేడీ ఓరియంటెడ్ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: