యంగ్ హీరో రాజ్ తరుణ్ సినిమాలకు హిట్ అన్న పదం విని సంవత్సరాలు గడిచిపోతోంది. దీనితో కనీసం సీనియర్ హీరోలతో మల్టీ స్టారర్ మూవీలలో నటిస్తే క్రేజ్ వస్తుందేమో అంటూ నాగార్జునతో కలిసి నటించిన ‘నా సామి రంగ’ కూడ రాజ్ తరుణ్ క్రేజ్ ను ఏమాత్రం పెంచలేదు. ఈమూవీలో నటించిన నాగార్జునకు పేరు వచ్చింది కానీ రాజ్ తరుణ్ కు కానీ అల్లరి నరేష్ కు కానీ ఈమూవీ ఏమాత్రం క్రేజ్ పెంచలేకపోయింది.ఇలాంటి పరిస్థితుల మధ్య రాజ్ తరుణ్ నటిస్తున్న మూడు సినిమాల పై అతడి కెరియర్ ఆధారపడి ఉండి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ‘తిరగబడరా సామీ’ ‘భలే ఉన్నాడే’ ‘పురుషోత్తముడు’ మూవీలు నిర్మాణం పూర్తి చేసుకుని అవి రిలీజ్ కు రెడీగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈసినిమాలో మొదటిగా విడుదల అయ్యేది ‘పురుషోత్తముడు’ జూన్ లో ఈసినిమను విడుదల చేస్తారు అని టాక్.ఈసినిమా దర్శకుడు రామ్ భీమన ఈమూవీలో రాజ్ తరుణ్ క్యారెక్టర్ ను ‘శ్రీమంతుడు’ మహేష్ పాత్ర ఛాయలతో డిజైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈమూవీలో రమ్యకృష్ణ ప్రకాష్ రాజ్ మురళీశర్మ బ్రహ్మానందం లాంటి పెద్ద క్యాస్టింగ్ ని తీసుకున్నారు. గోపి సుందర్ సంగీతం అందించగా స్టార్ హీరోలకే ఎక్కువ పని చేసిన పిజి విందా ఛాయాగ్రహణం అందిస్తున్నాడు.పెద్ద హీరోల సినిమాలతో సమానంగా టెక్నికల్ గా ఈసినిమాకు మంచి క్వాలిటీ ఇన్ పుట్ ను ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఈమూవీ టీజర్ ను చూసిన వారికి ఈమూవీ పై ‘శ్రీమంతుడు’ ఛాయలు కనిపిస్తున్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ‘శ్రీమంతుడు’ సినిమాను అనేక సార్లు టివి లలో చూసిన ప్రేక్షకులకు ‘పురుషోత్తముడు’ ప్రయోగం ఎంతవరకు నచ్చుతుంది అన్న సందేహాలు కొందరికి ఏర్పడుతున్నాయి. ఈసినిమాతో పాటు మారుతి బ్యాకింగ్ తో వస్తున్న ‘భలే ఉన్నాడే’ కూడ విడుదలకు రెడీగా ఉన్న పరిస్థితులలో ఈ రెండు సినిమాలలో ఏసీనిమా ముందుగా విడుదల అవుతుందో చూడాలి..మరింత సమాచారం తెలుసుకోండి: