చాలా కాలం తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తూ అల్లరి నరేష్ నటించిన సినిమా నే ఆ ఒక్కటి అడక్కు. సిరీస్ అండ్ డ్రామాస్ నుంచి మంచి బ్రేక్ తీసుకుని మళ్ళీ కామెడీ ట్రాక్ లోకి వచ్చిన అల్లరి నరేష్ చేసిన లేటెస్ట్ చిత్రం ఆ ఒక్కటి అడక్కు పై భారీ హైప్స్ ఉన్నాయి. యంగ్ హీరోయిన్ ఫరియా  అబ్దుల్లా హీరోయిన్గా దర్శకుడు మల్లి అంకం రూపొందించిన కామెడీ మరియు సందేశాత్మక చిత్రమే ఇది. ఇక థియేటర్లలో మోస్తారు గానే ఆడిన ఈ చిత్రం ఇప్పుడు ఓటిటి రిలీజ్ డేట్ కి సిద్ధమయ్యింది.

మూవీ స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకోగా ఇందులో ఈ చిత్రం మే 31 నుంచి అందుబాటులోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దీనిపై అధికారిక క్లారిటీ అయితే ఇంకా రాలేదు. ఇక ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించగా బిగ్బాస్ ఫేమ్ అరియానా , వైవా హర్ష తదితరులు నటించారు. ఇక ఓ రేంజ్ హైప్స్ తో థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా మోస్తారు కలెక్షన్స్ రాబట్టింది. అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత నటించిన కామెడీ చిత్రం ఇది. దీంతో ఈ సినిమాని చూసేందుకు పలువురు చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు.

ఇక జాతి రత్నాలు సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయిన ఫరియా అబ్దుల్లా మీ మూవీ లో అల్లరి నరేష్ కి జోడిగా నటించింది.‌ తన హైట్ తో అల్లరి నరేష్ నీ మ్యాచ్ చేయగలిగింది. జాతి రత్నాలు సినిమాతో ఈ బ్యూటీ కి స్టార్ డం వచ్చినప్పటికీ అవకాశాలు మాత్రం దక్కలేదు. దీనికి కారణం ఈ బ్యూటీ హైటే. హీరోస్ కన్నా ఎక్కువ హైట్ ఉన్న ఈమెని తమ సినిమాలో పెట్టుకోవడానికి ఏ డైరెక్టర్ కూడా ముందుకు రాలేదు. అందువల్లే జాతి రత్నాలు సినిమా తర్వాత చాలా గ్యాప్ ఇచ్చి ప్రెసెంట్ ఆ ఒక్కటి అడక్కు సినిమాతో మరోసారి తెరపై మెరిసింది. మరి రానున్న రోజుల్లో ఈ బ్యూటీ కి డైరెక్టర్లు జాలిపడి అయిన అవకాశాలు ఇస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: