పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ మూవీ నుంచి వచ్చిన గేమ్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. గ్యాంగ్ స్టార్ గా పవన్ కళ్యాణ్ యాక్షన్ అండ్ స్లాంగ్ అదిరిపోయింది. దీంతో ఈ చిత్రంపై భారీ హైప్స్ ఏర్పడ్డాయి. సాహో ఫేమ్ సుజిత్ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ కోసం ప్రతి ఒక్కరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 27వ తేదీన ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.

అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కారణంగా ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఈ చిత్రం నుంచి ఇప్పుడు తాజాగా ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు డాక్టర్ సుజిత్. కార్తికేయ హీరోగా వస్తున్న భజే వాయువేగం మూవీ ప్రమోషన్స్ లో డైరెక్టర్ సుజిత్ పాల్గొన్నారు.‌ ఈ క్రమంలోనే పవన్ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మూవీ ట్రైలర్ ఇప్పటికే సిద్ధమైందని డైరెక్టర్ సుజిత్ తెలిపారు. " టైలర్ ఇప్పటికే సిద్ధమైంది.

మూవీ రిలీజ్ కు ముందు వస్తుంది. పవన్ కళ్యాణ్ ను కొత్తగా చూపించేందుకు చాలా ఎక్సైటెడ్ గా ఉన్న " అంటూ వెల్లడించారు సుజిత్. అయితే మూవీ రిలీజ్ కు ముందు వస్తుందని తెలిపారు కానీ రిలీజ్ డేట్ ని మాత్రం రివీల్ చేయలేదు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో తనకు జానీ అంటే చాలా ఇష్టమని సుజిత్ చెప్పారు. ఇక ఈ చిత్రంలో నిజాయితీ ఉంటుందని.. డైరెక్టర్ గా అప్పట్లో పవన్ అద్భుతం చేశారని ఆయన అన్నారు. తాను అప్పట్లో జానీ బ్యాండ్ ను తలకు కట్టుకుని వారం తిరిగానని వెల్లడించారు సుజిత్. ప్రెసెంట్ ఈ డైరెక్టర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈయన వ్యాఖ్యలను చూసిన పలువు రూపాలు రకాలుగా స్పందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: