మ్యాన్ ఆఫ్ మాస్సెస్ జూ ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 31 వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్నఈ చిత్రం గురించి ఓ క్రేజీ న్యూస్ బయటికొచ్చింది. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర, వార్ 2 చిత్రాలతో బిజీగా ఉన్నారు. దేవర పార్ట్ 1 షూటింగ్ ముగింపు దశలో ఉంటే వార్ 2 షూటింగ్ గత నెలలోనే మొదలైంది. దేవర చిత్రం అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ రెండు చిత్రాలు ముగించిన తర్వాత కేజీఎఫ్, సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్సినిమా చేయబోతున్నారు. ఎన్టీఆర్ 31 పేరిట మొదలుకానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది.టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ‘KGF’ మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే.‘NTR31′ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ ప్రాజెక్ట్ ని ఎప్పుడో అనౌన్స్ చేశారు.’సలార్ 2’ తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘డ్రాగన్’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు ఇటీవలే వార్తలు వినిపించాయి.అయితే ఈ టైటిల్ ను బట్టి ఇందులో ఎన్టీఆర్ నెగిటివ్ రోల్ లో కనిపించనున్నట్టు లేటెస్ట్ టాక్ బయటికొచ్చింది.డ్రాగన్‌ అంటే యూరోపియన్‌ సంస్కృతిలో చెడుకి గుర్తు. మైథాలజీలో 'డ్రాగన్‌' అంటే రాక్షసుడు. చూపులకు పాములా, కాళజెర్రిలా కనిపించే డ్రాగన్‌కి నిప్పును పీల్చే గణం ఉంటుంది.అలాగే డ్రాగన్‌ అంటే అలజడికి సింబాలిక్‌. ఇలాంటి భయంకరమైన టైటిల్‌ని ఎన్టీఆర్ సినిమా కోసం మేకర్స్ పరిశీలిస్తుండటంతో సినిమాలో ఎన్టీఆర్ చేసేది నెగెటివ్ రోల్ అని, ప్రశాంత్‌ నీల్ టైటిల్‌కి తగ్గట్టుగా తారక్ క్యారెక్టర్ ను డిజైన్‌ చేశారట. ఇదే కనుక నిజమైతే ఎన్టీఆర్ మరోసారి నెగిటివ్ రోల్ లో అదరగొట్టడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. సినిమా అంతా యూరోపియన్ బ్యాక్ డ్రాప్ తో ఉండబోతుంది.ఇప్పటివరకూ తన చిత్రాలన్నింటికీ కాస్త వెరైటీ టైటిల్స్‌యే పెట్టారు నీల్. కేజీఎఫ్, సలార్ ఇలా ఈ పేర్లను ఆడియన్స్ పెద్దగా వినలేదు. ఇప్పుడు డ్రాగన్ అనే పేరు అందరికీ తెలిసినా కథకి దీనికి లింకేంటో చూడాలి. ఒకవేళ 'డ్రాగన్' టైటిల్ ఓకే అయితే మాత్రం అదిరిపోయినట్లే అంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: