రాజమౌళి .. టాలీవుడ్ ఇండస్ట్రీ లో దర్శకధీరుడు గా బాగా పాపులారిటీ సంపాదించుకున్న డైరెక్టర్. సినిమా లను ఏ డైరెక్టర్ అయిన తెరకెక్కిస్తాడు . కానీ జనాలను అర్థం చేసుకొని వాళ్ళ నాడి పట్టుకున్న రేంజ్ లో సినిమాలను తెరకెక్కించే డైరెక్టర్ మన ఇండస్ట్రీ లో చాలా చాలా తక్కువ .ఆ లిస్టులోకే వచ్చేస్తాడు రాజమౌళి. ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన సినిమాలు ఒక్కటంటే ఒక్కటి కూడా ఫ్లాప్ కాలేదు .. అంటే రీజన్ మాత్రం ఆయన డెడికేషన్ అని చెప్పాలి .ఒక సీన్ షూట్ చేయాలన్నా సరే ఒకటికి పది సార్లు ఆలోచిస్తాడు రాజమౌళి . అలాంటిది తన సినిమాలో ఒక అమ్మాయిని హీరోయిన్గా పెట్టుకోవాలి అంటే ఎన్నిసార్లు ఆలోచిస్తాడు.. ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబు తో ఒక సినిమాను తెరకెక్కించడానికి సిద్ధంగా ఉన్నాడు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లాలి కానీ మహేష్ బాబు లుక్స్ పై సాటిస్ఫై అవ్వని రాజమౌళి సినిమాను వాయిదా పై వాయిదా వేసుకుంటూ వస్తున్నాడు .అయితే సినిమాలో నటించే ప్రతి క్యారెక్టర్ విషయంలో రాజమౌళి చాలా చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నారట. ఈ క్రమంలోనే సినిమాలో కేవలం ఐదు నిమిషాలు కనిపించే పాత్ర కోసం మలయాళీ బ్యూటీ మమిత బైజును చూస్ చేసుకున్నారట . ప్రేమలు సినిమా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న మమిత బైజుపై రాజమౌళి గతంలో చేసిన కామెంట్స్ అందరికీ గుర్తుండే ఉంటాయి . ఆమె నటనకు ఫిదా అయిపోయాడు .. అలాంటి బ్యూటీని తన సినిమా లో పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు రాజమౌళి . ఇది తెలుసుకున్న ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు . కేవలం ఐదు నిమిషాల పాత్ర కోసం అంత పెద్ద హీరోయిన్ చూస్ చేసుకున్నావా..? నీ టాలెంట్ కి ఫిదా అయిపోయాం అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: