మరి కొందరు మాత్రం మౌనిక రెడ్డి వల్లే మనోజ్ మారిపోయాడు అని అంటున్నాడు గా మోహన్ బాబు. అందుకే ఇద్దరిని పంపించేసారు అంటున్నారు . అయితే ఆయన ఇంట్లో పనిచేసే పనిమనిషి సైతం మోహన్ బాబు గారికి మౌనికమ్మను పెళ్లి చేసుకోవడం అసలు ఇష్టం లేదు అని ..ముందు నుంచి ఆ విషయం అందరికీ తెలిసిందే అని చెప్పుకు వచ్చింది. అయితే మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకోవడం ఎందుకు మోహన్ బాబుకి ఇష్టం లేదు అన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఆస్తిపాస్తుల్లో పరువు మర్యాదల్లో మౌనిక రెడ్డి ఫ్యామిలీ తీసి పడేయాల్సిన విషయం కాదు . బాగా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తి. అమ్మ - నాన్న -అక్క అందరూ కూడా పొలిటికల్ పరంగా మంచి స్థానంలోనే ఉన్నారు .
అయితే మౌనిక రెడ్డిని ఎందుకు తన ఇంటి కోడలుగా యాక్సెప్ట్ చేయలేకపోయాడు మోహన్ బాబు అంటే మాత్రం ఆమెకు ఆల్రెడీ పెళ్లయి ఒక బిడ్డ ఉండడమే అంటూ తెలుస్తుంది. మౌనికకి ఆల్రెడీ పెళ్లయింది . ఒక బాబు కూడా ఉన్నాడు . అయినా సరే మంచు మనోజ్ ఆమెపై ఉన్న ఇష్టంతో ప్రేమకు ఎటువంటివి అడ్డు రావు అని ప్రూవ్ చేయడానికి పెళ్లి చేసుకున్నాడు. రీసెంట్ గా ఒక పాపకి కూడా జన్మనిచ్చారు ఈ జంట. అంత సవ్యంగా జరిగిపోతుంది అనుకున్న మూమెంట్లో ఇలా మోహన్ బాబు ఇంటి నుండి వాళ్ళిద్దరిని గెంటేయడం సంచలనంగా మారింది . వీళ్ళ మధ్య ఏదో ఆస్తి తగాదాలు ఉన్నాయి అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి . అయితే మోహన్ బాబు సైతం నా ఆస్తి నా ఇష్టం నేను ఎవరికైనా ఇచ్చుకుంటా దానధర్మాలు చేస్తా అడిగే రైట్ ఎవరికీ లేదు అంటూ తేల్చి చెప్పడంతో నిజంగానే వీళ్ల మధ్య ఆస్తిఇష్యూలు ఉన్నాయి అని తేలిపోయింది . అసలు దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది..? ఎలా పడుతుంది..? అనేది ఆ దేవుడికి తెలియాలి అంటున్నారు జనాలు..!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి