టాలీవుడ్ లో నటుడిగా, హీరోగా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న ప్రియదర్శి వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ప్రియదర్శి నటిస్తున్న సారంగపాణి జాతకం అనే సినిమా ఏప్రిల్ 25న ప్రేక్షకులందరికీ రాబోతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఉన్నారు ప్రియదర్శి. అలా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్లో ఎప్పుడు కూడా కమెడియన్ అవుతానని అనుకోలేదని.. ఎందుకంటే తాను ఇండస్ట్రీలో కమెడియన్ అవుతానని రాలేదని వెల్లడించారు. తను ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు లాంటి నటులను చూసి యాక్టింగ్ నేర్చుకొని అలా చేద్దామని వచ్చానని తెలిపారు.


కానీ తన సినీ కెరియర్ లో ఇప్పటివరకు అలాంటి పాత్ర రాలేదని చాలా అసంతృప్తిగా ఉన్నానంటూ తెలియజేశారు. తాను చాలా రోజుల నుంచి కామెడీ సినిమాలే కాకుండా యాక్టింగ్ పరమైన క్యారెక్టర్లలో  కూడా నటించాలని కోరిక ఉన్నది. కోర్టు సినిమా తన లైఫ్ లో తీసుకున్న ఒక బెస్ట్ నిర్ణయంగా భావిస్తున్నానని తెలిపారు. కానీ తన కెరియర్లో  తీసుకున్న ఒక చెత్త నిర్ణయం ఏమిటంటే మిఠాయి సినిమాలో నటించడం. ఈ సినిమాలో నటించి తాను తప్పు చేశానని తెలియజేశారు ప్రియదర్శి.


అందుకే ఇప్పుడిప్పుడే తనకు ఎలాంటి సినిమాలు చేయాలి ప్రేక్షకులకు  ఎలా కనెక్ట్ అవ్వాలనే విషయంపై క్లారిటీ వస్తోందని ఇప్పటివరకు తాను చేసిన సినిమాలన్నీ కూడా ఒక ఎత్తు అని ఇకమీదట నుంచి చేసే సినిమాలు మరొక ఎత్తులా ఉంటాయని తెలిపారు. సారంగపాణి జాతకం సినిమా తనకు ఒక కొత్త తరహా సినిమా లాగా ఉండదని ఇలాంటి పాత్రలు ఇప్పటివరకు తాను నటించలేదని అందరిని అలరిస్తుందని కచ్చితంగా నమ్మకం ఉన్నదంటూ తెలిపారు ప్రియదర్శి. మరి ఏ మేరకు ప్రియదర్శి నటించిన సినిమా ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఏప్రిల్ 25 వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: