స్టార్ హీరోయిన్ సమంతకు ప్రేక్షకుల్లో ఫాలోయింగ్, పాపులారిటీ, క్రేజ్, రేంజ్ పెరుగుతోంది. సమంత శుభం సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సమంత శుభం సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు. నటిగా కంటే నిర్మాతగానే సినిమాల గురించి ఎక్కువగ నేర్చుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు. రిస్క్ తీసుకుంటేనే లైఫ్ లో ముందుకు సాగుతామని ఆమె పేర్కొన్నారు.
 
నాకు సవాళ్లను ఎదుర్కోవడం ఇష్టమని ఎన్నోసార్లు రిస్క్ తీసుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు. 15 ఏళ్ల నా కెరీర్ లో కథల గురించి తెలుసుకున్నానని ఆ అనుభవంతోనే నిర్మాతగా మారానని సమంత అన్నారు. నాకు మంచి టీమ్ దొరికిందని సమంత అభిప్రాయపడ్డారు. సినిమాలో భాగమైన సమయంలో నటిగా కంటే నిర్మతగా ఎక్కువ బాధ్యతలు ఉంటాయని అర్థం అయిందని ఆమె అన్నారు.
 
ఒకే రకమైన సినిమాలకు నేను పరిమితం కావాలని అనుకోలేదని ఆమె కామెంట్లు చేశారు. రొటీన్ కు భిన్నమైన కథలను రూపొందిస్తానని సమంత పేర్కొన్నారు. శుభం సినిమా నైజాం హక్కులు మైత్రీ మూవీ మేకర్స్ సొంతం కాగా ఏపీ హక్కులు సురేష్ ప్రొడక్షన్స్ సొంతమయ్యాయి. సమంతపై అభిమానంతో ఏపీ, సీడెడ్ లో సురేష్ బాబు ఈ సినిమాను పంపిణీ చేయనున్నారు.
 
సమంతకు రిలీజ్ కు ముందే ఏకంగా 3 కోట్ల రూపాయల లాభాలు సొంతం చేసుకునన్నారని తెలుస్తోంది. సమంత కెరీర్ పరంగ మరిన్ని విజయాలను సొంతం చేసుకుని నిర్మాతగా కూడా అభిరుచిని చాటుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. సమంత భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. సమంతను అభిమానించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సమంత కూడా ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో నటించడం ఈ సినిమాపై అంచనాలను పెంచింది. సమంత ఈ సినిమాలో మాతాజీ పాత్రలో కనిపించనున్నారు.సమంత రేంజ్ అంతకంతకూ పెరగాలని ఆమె మరిన్ని సంచలనాఅను సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.




 


మరింత సమాచారం తెలుసుకోండి: