అల్లు అర్జున్ పుష్ప చిత్రంతో పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. ఇక తన తదుపరి చిత్రం కూడా గుర్తుండిపోయే విధంగా డైరెక్టర్ అట్లీతో ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఇటీవలే ముంబైలో నిర్వహించినటువంటి వేవ్స్ సమ్మిట్ లో కూడా అల్లు అర్జున్ పాల్గొనడం జరిగింది. ఈ స్టేజి పైన అల్లు అర్జున్ ఇంటర్వ్యూ చేయగా పలు విషయాలను సైతం తెలియజేశారు. ముఖ్యంగా అల్లు అర్జున్ తన ఫిట్నెస్ గురించి కొన్ని విషయాలను తెలియజేయడం జరిగింది.


అల్లు అర్జున్ మాట్లాడుతూ యాక్టర్స్ కి ఖచ్చితంగా ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యము.. ఎప్పుడు డ్యాన్స్ ,ఫైట్స్ ఉంటాయో తెలియదు. అందుకే మన బాడీ ముందుగానే ప్రిపేర్ గా పెట్టుకోవాలని తెలిపారు. అలా తన 10వ సినిమా షూటింగ్ తర్వాత తనకు ఒక యాక్సిడెంట్ జరిగిందని ఆ సమయంలో తన భుజం చాలా గాయపడిందని తెలిపారు అల్లు అర్జున్. అయితే అంతకుముందే ఒక చిన్నపాటి సర్జరీ కావడం వల్ల మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవలసి వచ్చిందని తెలిపారు. ఆ తర్వాత నాలుగవ వారం జిమ్ముకు వెళ్లాను .. అయినా జరిగింది అని తెలిపారు.


 ఈసారి అలాగే అవుతుందని చాలా భయపడ్డాను. అప్పుడు ఆస్ట్రేలియాలో జరగడంతో.. వైద్యులు దగ్గరికి వెళితే వారు సుమారుగా ఆరు నెలలు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. ఇది తను ఊహించలేకపోయానని కానీ రెండు మూడు నెలల్లోనే తన నెక్స్ట్ సినిమా మొదలు పెట్టాల్సి ఉన్నది.. ఆ సమయంలో తాను ఎక్కువగా భయపడిపోయానని తెలియజేశారు అల్లు అర్జున్. ఆ సమయంలోనే తనకు ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఎంత ముఖ్యమో తెలిసిందని తెలిపారు.కానీ వయసు పెరిగే కొద్దీ కూడా ఫిజికల్  అనేది తగ్గిపోతోందని తన 11వ సినిమా నుంచి ఎక్కువగా ఫిట్నెస్ మీద యాక్టింగ్ మీదే ఫోకస్ పెట్టానని తెలిపారు అల్లు అర్జున్. అప్పటినుంచి ఇప్పటివరకు అన్ని విషయాలలో ఫిట్నెస్ గానే ఉంటుందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: