టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది యాంకర్లు ఉన్నారు. అందులో ఒకానొక సమయంలో చాలా తక్కువ మంది ఉండేవారు. ఇక నేటి కాలంలో రోజుకు ఒక యాంకర్ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతూనే ఉన్నారు. ఎంతోమంది యాంకర్లు వచ్చినప్పటికీ కొంతమందికి మాత్రం ప్రేక్షకుల గుండెల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న వారు కొందరే ఉంటారు. అలాంటి వారిలో ప్రముఖ యాంకrర్ శ్రీముఖి ఒకరు. ఈ భామ పటాస్ షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ షోలో యాంకర్ గా చేస్తూనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఆ షోలో యాంకర్ గా చేస్తూనే మరోవైపు వివిధ ప్రోగ్రామ్ లలో యాంకర్ గా చేసే అవకాశాలను అందిపుచ్చుకుంది.

 ప్రస్తుతం టాప్ మోస్ట్ యాంకర్ల జాబితాలో శ్రీముఖి ముందు వరుసలో ఉంటారు. ఇక శ్రీముఖి యాంకర్ గా మాత్రమే కాకుండా సినిమాలలో నటించింది. హీరోలకు చెల్లెలి పాత్రలో హీరోయిన్లకు బెస్ట్ ఫ్రెండ్ పాత్రలను పోషించి మంచి గుర్తింపు పొందింది. ఈ మధ్యకాలంలో శ్రీముఖి ఫుల్ బిజీ యాంకర్ గా మారిపోయింది. తనదైన యాంకరింగ్ స్టైల్ తో దూసుకుపోతోంది. ఇక యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. తనకు సంబంధించిన ప్రతి ఒక్క ఫోటోను సోషల్ మీడియాలో తన అభిమానులతో షేర్ చేసుకోగా అవి క్షణాల్లోనే వైరల్ గా మారుతాయి. నిత్యం ఏదో ఒక ఫోటోను తన అభిమానులతో షేర్ చేసుకుంటూనే ఉంటుంది. ఎంతో అందంగా, కుందనపు బొమ్మల ముస్తాబు అవుతుంది.

ఇదిలా ఉండగా.... ప్రస్తుతం శ్రీముఖి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. శ్రీముఖి చిన్న వయసులో చాలా లావుగా ఉండేది. యాంకర్ కావాలని పట్టుదలతో తాను చాలా స్లిమ్ గా మారింది. ఒకప్పుడు 100 కిలోలకు పైనే బరువు ఉండేదాన్నని శ్రీముఖి చెప్పింది. బరువు తగ్గడం కోసం ఎంతో కష్టపడ్డానని... ఫలితంగా సక్సెస్ సాధించాలని శ్రీముఖి మాట్లాడారు. ప్రస్తుతం శ్రీముఖి ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన చాలామంది నెటిజన్లు ఒకప్పుడు ఎంత లావుగా ఉండే దానివి ఇప్పుడు చాలా అందంగా, హాట్ గా ఉన్నావని కామెంట్లు చేస్తున్నారు. దీనిపై శ్రీముఖి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: