- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

ఇండియన్ చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనే క్రేజీ మల్టీస్టారర్ గా బాలీవుడ్ లో తెర్కక్కుతున్న వార్ 2 అందరికీ తెలిసిందే .. బాలీవుడ్  గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ అలాగే తెలుగు నుంచి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లు హీరోలు గా దర్శకుడు అయాన్ ముఖర్జీ  తతెరకెక్కిస్తున్న భారీ మూవీ .. వార్ 2 మూవీ పై ప్రపంచవ్యాప్తం గా ఎన్నో భారీ అంచ‌నాలు ఉన్నాయి .. అయితే ఇప్పుడు ఈ సినిమా కు సంబంధించిన షూటింగ్ అంతా కంప్లీట్ అయి .. అంతా అసలు ట్రీట్ కోసం ఎదురు చూస్తున్నారు .  అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఈ సినిమా నుంచి బయటి కి రాలేదు  ..కానీ ఇప్పుడు నేరు గా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేస్తారని టాక్ బయట కు వచ్చింది ..

అయితే ఇప్పుడు తాజా టాక్ ప్రకారం అయితే టీజర్ పై బిగ్ అప్డేట్ ఈ కొద్ది సమయం లోనే వచ్చే అవకాశం ఉన్నట్టు గా తెలుస్తుంది .. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ వారు ఆ బిగ్ అప్డేట్ ఈ రెండు రోజుల్లో నే ఇవ్వబోతున్నారట .. అలాగే దీని తో పాటు గా మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు కానుక గా ఈ భారీ టీజర్ ని రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టు గా ఇప్పుడు తెలుస్తుంది .  అయితే ఎన్టీఆర్ అభిమానులకు ఈ పుట్టిన రోజు మాత్రం వార్ 2 టీజర్ రిలీజ్ చేస్తే మాత్రం ఎంతో స్పెషల్ గా మారిపోతుంది అనటం లో ఎలాంటి సందేహం లేదు .. అదేవిధంగా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా నుంచి కూడా  క్రేజీ అప్డేట్ రాబోతుంద ని కూడా అంటున్నారు ..

మరింత సమాచారం తెలుసుకోండి: