అయితే ఇంత రేట్లు ఎందుకు అని అడిగిన ఓ కస్టమర్‌పై నోటి దురుసు చూపడంతో వాళ్ల వ్యాపారం ఒక్క దెబ్బతో మూతపడింది. పైగా ముగ్గురు అక్కచెల్లెళ్లు ఇంటా బయటా ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు. సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేయబడ్డారు. ఈ సంగతి పక్కన పెడితే.. పచ్చళ్లు అమ్మడం ద్వారా కన్నా గ్లామర్ షో చేయడం ద్వారా ఎక్కువ మంది ఫాలోవర్స్ ను సంపాదించుకున్న చిట్టి చెల్లి రమ్య కంచర్ల సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోంది. ఓంకార్ తమ్ముడు, టాలీవుడ్ యంగ్ హీరో అశ్విన్ బాబు, రియా లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన తాజా చిత్రం `వచ్చినవాడు గౌతమ్`. మామిడాల ఎం.ఆర్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ మెడికో థ్రిల్లర్ మూవీని టి. గణపతిరెడ్డి నిర్మిస్తున్నారు.
అయితే ఈ చిత్రంలో ఛాన్స్ రావడంతో అలేఖ్య చిట్టి పికిల్స్ బ్యూటీ రమ్య ఒక పాత్రలో యాక్ట్ చేసింది. తాజాగా హైదరాబాద్ లో జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్ లో రమ్య చిత్రబృందంతో కలిసి కనిపించడంతో విషయం స్పష్టమైంది. దాంతో మీమర్స్ కొంచెం కామెడీగా, మరికొంచెం క్రియేటివ్ గా రమ్య ఫిల్మ్ ఎంట్రీపై మీమ్స్ క్రియేట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు